ఆన్ లైన్లో `ట్యాక్సీవాలా`...కేసు న‌మోదు!

ఆన్ లైన్లో `ట్యాక్సీవాలా`...కేసు న‌మోదు!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఇంటిదొంగ‌ల బెడ‌ద‌తో చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇబ్బందిప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ , గీత గోవిందం` లీకులు వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ వివాదాలు స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మరో సినిమా ‘ట్యాక్సీవాలా’ లీక‌వ‌డం పెను దుమారం రేపింది. ఎడిటింగ్‌ కాకముందే ట్యాక్సీవాలా హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో చిత్ర నిర్మాత‌లు షాక‌య్యారు. ఆ వ్య‌వ‌హారం పై పోలీసులకు సోమ‌వారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ సినిమాను షేర్ చేస్తున్న మూడు జీ మెయిల్ ఐడీల‌ను పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.  

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ట్యాక్సీవాలా’ ఎడిటింగ్ కు రెడీ అయింది. సెప్టెంబ‌రులో ఈ సినిమాను విడుదల చేసేందుకు యూవీ, జీఏలు నిర్మాణ సంస్థ‌లు ప్లాన్ చేస్తున్నాయి. అయితే, ఈ లోపే ఆ చిత్రం హెడీ ప్రింట్ ఫుల్ వెర్ష‌న్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ లో అప్‌లోడ్ అయింది. దానిని గుర్తించిన చిత్ర యూనిట్ ...పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అంత‌కుముందే, తెలుగు ఫిలిమ్‌ చాంబర్‌ ఆధీనంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ కు కూడా చిత్ర నిర్మాత‌లు ఫిర్యాదు చేశారు. రెల్ల కమల్, భార్గవ్‌కుమార్, బీఆర్‌ పేర్లతో ఉన్న జీ–మెయిల్‌ ఐడీల డ్రైవ్‌ అకౌంట్ల ద్వారా లింకులు షేర్‌ అవుతున్నాయని నిర్మాత‌లు.....పోలీసులకు ఫిర్యాదు చేశారు. `గీత గోవిందం` సినిమా లీకేజీ విష‌యం స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రోసారి విజ‌య్ సినిమా లీక‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు