కల నెరవేరె.. రజినీతో త్రిష

 కల నెరవేరె.. రజినీతో త్రిష

కొన్ని నెలల కిందటే ‘కాలా’తో పలకరించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ‘2.0’ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్న రజినీకి అదే చివరి సినిమా అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ రజినీ అనూహ్యంగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్‌ సెట్ చేసుకున్నాడు కార్తీక్. విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజల్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మొదట్లోనే ప్రకటించారు. తర్వాత నవాజుద్దీన్‌తో పాటుగా సిమ్రాన్ ఈ చిత్రానికి యాడ్ అయ్యారు. ఇందులో నవాజే విలన్ అని తేలింది.

మరి సిమ్రాన్ రజినీకి జోడీగా నటిస్తోందా లేదా అన్నది తెలియలేదు. ఈలోపు మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో భాగమైంది. ఆమె మరెవరో కాదు.. త్రిష. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తాజాగా ధ్రువీకరించింది. 15 ఏళ్ల కెరీర్లో త్రిష దక్షిణాదిన ఎంతోమంది స్టార్లతో నటించింది. కానీ రజినీతో నటించాలన్న ఆమె కల మాత్రం నెరవేరలేదు. రజినీ సినిమాల నుంచి నిష్క్రమించబోతున్న నేపథ్యంలో ఆమె కోరిక తీరదనే అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమెను అవకాశం వరించింది. ఈ విషయంలో త్రిష చాలా ఎగ్జైట్ అవుతోంది.

తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి  సంగీతాన్నందిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘రోబో’ తర్వాత చాలా ఏళ్లకు పునరాగమనం చేస్తున్న సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రమిది. దీని బడ్జెట్ దాదాపు రూ.150 కోట్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English