ఫ‌స్ట్ వీకెండ్.. 'గీత గోవిందం' క‌లెక్షన్ల సునామీ!

ఫ‌స్ట్ వీకెండ్.. 'గీత గోవిందం' క‌లెక్షన్ల సునామీ!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో  'గీత గోవిందం' సినిమా హ‌వా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం...బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న‌లు జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి నుంచి గోవింద్ పాత్ర‌లోకి విజ‌య్ ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు...విమ‌ర్శ‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. తొలిరోజు తొలి షో నుంచే అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చిన ఈ చిత్రం...హిట్ టాక్ తో ఫ‌స్ట్ వీకెండ్(5 రోజులు)లో రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. మొద‌టి 5 రోజుల్లో  'గీత గోవిందం' ప్ర‌పంచ‌వ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ రాబ‌ట్టి....స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. యూఎస్ లో కూడా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో 1.5 మిలియ‌న్లు రాబ‌ట్టడం విశేషం.

ఈ సినిమాతో టాలీవుడ్ లో మ‌రో న‌యా సూప‌ర్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అంటూ టాక్ వినిపిస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోన్న ఈ చిత్రం స్టార్ హీరో సినిమాల రేంజ్ లో క‌లెక్ట్ చేయ‌డం విశేషం. మొద‌టి షో నుంచే సినిమాకు పాజిటివ్ బ‌జ్ రావ‌డంతో మౌత్ టాక్ తోనే సినిమాకు మంచి ప‌బ్లిసిటీ ల‌భించింది. లీకుల‌ను త‌ట్టుకొని కూడా...ఫస్ట్ డే రూ. 16.40 కోట్లు గ్రాస్ వసూలు చేయడం విశేషం. 2018లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాల్లో గీత గోవిందం ఒక‌టి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్ముడుపోగా... ఫస్ట్ వీకెండ్ రూ. 55 కోట్ల గ్రాస్, రూ.31 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో, ఇప్ప‌టికే డిస్ట్రిబ్యూటర్లు 200శాతానికి పైగా లాభ‌ప‌డ్డారు. ఇప్ప‌ట్లో ఈ సినిమాకు గ‌ట్టిపోటీ కూడా లేక‌పోవ‌డంతో ఫుల్ రన్‌లో ఈ చిత్రం ఎంత రాబ‌డుతుందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు