దేవరకొండ క్రికెట్ కబుర్లు

దేవరకొండ క్రికెట్ కబుర్లు

క్రికెట్‌ను మతంగా భావించే దేశం మనది. కనీసం 80 శాతం మంది ఏదో ఒక దశలో క్రికెట్‌తో అసోసియేట్ కాకుండా ఉండరు. ఈ 80 శాతంలో అందరూ క్రికెట్ ఆడకపోయినా చూస్తారు. క్రికెట్ సంగతులు తెలుసుకుంటారు. ఇక యువతలో మెజారిటీ క్రికెట్‌తో అనుబంధం ఉన్న వాళ్లే ఉంటారు. సెలబ్రెటీలు కూడా క్రికెట్ అంటే పడి చచ్చేవాళ్లే. చాలామంది క్రికెట్ ఆడేవాళ్లే. తాను కూడా అందుకు మినహాయింపేమీ కాదంటున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. విజయ్ బేసిగ్గా ఫాస్ట్ బౌలరట. ఒక దశలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని సీరియస్‌గానే ప్రాక్టీస్ చేసేవాడట. కానీ ఒక తన సత్తా క్రికెట్లో కొనసాగేందుకు సరిపోదని తర్వాత వెనక్కి తగ్గాడట. అందుకు దారి తీసిన కారణమేంటో విజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తమ క్లాసులో 60 మంది ఉంటే 40 మంది కలలు క్రికెట్ చుట్టూనే తిరిగేవని.. అందులో తాను కూడా ఒకడినని విజయ్ చెప్పాడు. కాలేజీ రోజుల్లో తాను ఫాస్ట్ బౌలర్ అని.. తన స్పీడు చూసి తనకు తాను షోయబ్ అక్తర్ అనుకునేవాడినని.. ఇంతకీ తన స్పీడెంతో తెలుసుకుందామని.. ఒకసారి స్పీడ్ మిషన్ తీసుకొచ్చి చెక్ చేసి చూశానని.. 90 కిలోమీటర్ల లోపే ఉండటం చూసి ఆశ్చర్యపోయానని విజయ్ తెలిపాడు. స్పిన్నర్ అయిన అనిల్ కుంబ్లే నిలబడి వంద కిలోమీటర్ల వేగంతో బంతులేస్తుంటే.. మనం 90 దాటట్లేదేంటి అనిపించిందని.. అప్పుడు ఇది మన వల్ల కాదని డిసైడయ్యానని విజయ్ తెలిపాడు. కలలు కనడం తప్పు కాదని.. కానీ ఆ కలలకు మనం సరిపోతామా లేదా అని కూడా చూసుకోవాలని అతనన్నాడు. ‘‘నువ్వు గొప్ప బ్యాట్స్‌మన్ కావచ్చు. కానీ భారత క్రికెట్లో పది మంది బ్యాటింగ్ స్టార్లు ఉన్నపుడు నీ అవసరం రాకపోవచ్చు. ఒకవేళ టీమ్ ఇండియాలో స్పిన్నర్ల కొరత ఉందని అనిపిస్తే ఆ విభాగంలో ప్రావీణ్యం సాధించడానికి పాటు పడాలి. అందరిలో ప్రతిభ ఉంటుంది. కానీ కొంచెం కామన్ సెన్స్ కూడా ఉపయోగిస్తేనే విజయం సాధించవచ్చు’’ అంటూ వర్ధమాన క్రికెటర్లకు సలహా ఇచ్చాడు విజయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు