చిరు సినిమా బాలీవుడ్లోకి..

చిరు సినిమా బాలీవుడ్లోకి..

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఎలాంటి సినిమా చేయాలా అని చాలా తర్జనభర్జనకు గురయ్యాడు. చివరికి ఆయన సేఫ్‌గా తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ని రీమేక్ చేయడానికి డిసైడయ్యాడు. ఆయన నిర్ణయం సరైన ఫలితాన్నే ఇచ్చింది. ‘కత్తి’ లాగే ‘ఖైదీ నంబర్ 150’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘కత్తి’ హిందీలోకి వెళ్తుండటం విశేషం. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ సొంతం చేసుకున్నాడు. ఐతే ఈ చిత్రానికి హీరో ఎవరు.. దర్శకత్వం ఎవరు చేస్తారన్నది ఇంకా ఖరారవ్వలేదు. త్వరలోనే ఈ విషయంలో ప్రకటన రానుంది.

బన్సాలీ సొంతంగా దర్శకత్వం వహించే సినిమాలన్నీ కళాత్మకంగా ఉంటాయి. ‘హమ్ దిల్ కే చుకే సనమ్’ నుంచి ‘పద్మావత్’ వరకు ఆయన సినిమాల్ని పరిశీలిస్తే ఆ సంగతి అర్థమవుతుంది. కానీ బన్సాలీ ప్రొడ్యూస్ చేసే సినిమాల తీరు వేరు. ఆయన ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే ఎంచుకుంటాడు. దక్షిణాదిన బ్లాక్ బస్టర్లయిన ‘విక్రమర్కుడు’.. ‘రమణ’ (తెలుగులో ఠాగూర్) చిత్రాల్ని బన్సాలీ హిందీలో పునర్నిర్మించడం విశేషం. వాటిలో అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ బ్లాక్ బస్టర్ అయింది. క్రిష్ దర్శకత్వంలో అక్షయే హీరోగా నటించిన ‘ఠాగూర్’ రీమేక్ ‘గబ్బర్’ మాత్రం ఫ్లాప్ అయింది. మరి ‘కత్తిై’ రీమేక్ బన్సాలీ ఎవరితో చేస్తాడో.. అది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు