విజయ్ పెద్ద ముదురు.. అర‌వింద్ కొత్త యాంగిల్!

విజయ్ పెద్ద ముదురు.. అర‌వింద్ కొత్త యాంగిల్!

టాలీవుడ్ తాజా సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక సినిమా హిట్ అయితే ఓకే. త‌ర్వాతి సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధిస్తే అదృష్టం దండిగా ఉండింద‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. మ‌రి.. మూడో సినిమా మ‌రింత స‌క్సెస్ అయితే.. ఎంత కాద‌న్నా.. స‌ద‌రు హీరోలో ఏదో ప్ర‌త్యేక‌త ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొత్త స్టార్ కు వెల్ కం చెప్పే విష‌యంలో టాలీవుడ్ మొహ‌మాట‌ప‌డ‌టం లేదు స‌రిక‌దా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేనంత గొప్ప‌గా కీర్తిస్తోంది. నెత్తిన పెట్టుకుంటోంది. అంత‌టి అదృష్టాన్ని సొంతం చేసుకున్న‌ది విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

గీతాగోవిందం చిత్రంతో ఆగ్ర న‌టుల జాబితాలోకి చేరిపోయిన‌ట్లేన‌ని మెగాస్టార్ చిరంజీవి ప‌బ్లిక్ గా అనౌన్స్ చేశారంటే.. రియ‌ల్ గోవిందుడుకు ఇప్పుడు అగ్ర తారాల జీబితాలోకి చేరిపోయిన‌ట్లే. విజ‌య్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తో నెటిజ‌న్లు ఎప్పుడో పోల్చేస్తే.. ఆ ప్ర‌భావం ఇండ‌స్ట్రీ మీద కూడా ఉంద‌న్న విష‌యం తాజా గీతాగోవిందం స‌క్సెస్ మీట్ మ‌రింత స్ప‌ష్టం చేసింది.

ప‌వ‌న్ వార‌సుడిగా విజ‌య్ పేరును ప్ర‌స్తావించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. విజ‌య్ ను చిరుతో పోలుస్తూ.. చిరంజీవిలానే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఎదుటి వ్య‌క్తి చెప్పేది విని ఆలోచిస్తాడు.. విజ‌య్ చాలా ముదురు అంటూ.. మ‌ధ్య‌లో కాస్త పాజ్ ఇస్తూ.. అంటే తెలివైనోడు అంటూ కంప్లీట్ చేసిన అల్లు అర‌వింద్ మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. మొత్తానికి ముదురు అంటే తెలివైనోడు అన్న కొత్త అర్థాన్ని చెప్పిన అర‌వింద్.. విజ‌య్ లోని కొత్త యాంగిల్ ను చెప్పేసిన‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు