అల్లు అరవింద్ సీక్రెట్ చెప్పిన శిష్యుడు

అల్లు అరవింద్ సీక్రెట్ చెప్పిన శిష్యుడు

బన్నీ వాసు.. గత కొన్నేళ్లుగా ‘గీతా ఆర్ట్స్’ బేనర్‌కు వెన్నెముకలా నిలుస్తున్న వ్యక్తి. బన్నీ స్నేహితుడిగా అల్లు కాంపౌండ్లోకి వచ్చిన అతను.. గీతా ఆర్ట్స్ బేనర్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారాడు. అల్లు అరవింద్ కొంచెం వెనుక ఉంటూ తన బేనర్లో తెరకెక్కుతున్న సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలన్నీ అతడికే అప్పజెబుతున్నాడు.

‘గీతా ఆర్ట్స్-2’ బేనర్లో తెరకెక్కే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు నిర్మాతగా వాసు పేరే పడుతుండటం విశేషం. తాజాగా ఈ బేనర్లో ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ చిత్ర సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. అల్లు అరవింద్ సక్సెస్ సీక్రెట్ ఏంటో వివరించాడు బన్నీ వాసు.

అల్లు అరవింద్ తన సినిమాల విషయంలో చాలా లెక్కలు వేసుకుంటాడని.. డబ్బులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని.. లెక్కలేసుకుని బిజినెస్ చేస్తాడని అనుకుంటారని.. ఇది పూర్తిగా తప్పని బన్నీ వాసు అన్నాడు. అరవింద్ దానికి పూర్తి భిన్నమైన వ్యక్తి అని అతనన్నాడు. ఒక సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలనే ముందు ఆయన ఆలోచిస్తారని.. ఆ కథకు న్యాయం చేయడానికి ఏం చేయాలో అదంతా చేస్తారని.. ఇదే ఆయన  సక్సెస్‌కు ప్రధాన కారణమని అన్నాడు.

సినిమా విడుదలకు ముందు మాత్రమే ఆయన లెక్కలు చూస్తారని.. ఎంత ఖర్చయింది ఎంత రాబట్టుకోవాల్సి ఉంది అన్నది ఆలోచిస్తారని బన్నీ వాసు చెప్పాడు. ఇక సినిమా ఔట్ పుట్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడడని.. దర్శకుడికి పూర్తి సంతృప్తి వచ్చే వరకు మళ్లీ మళ్లీ సీన్లు తీయడానికి కూడా వెనుకాడరని.. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తారని వాసు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు