దేవరకొండను ఇమిటేట్ చేసిన చిరు

దేవరకొండను ఇమిటేట్ చేసిన చిరు

వర్ధమాన హీరోలందరూ మెగాస్టార్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. మరి ఆయన ఒక యువ కథానాయకుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్లో ఈ చిత్రమే చోటు చేసుకుంది. చిరు ఈ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేయడం విశేషం.

‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమా తర్వాత ‘గీత గోవిందం’ లాంటి సాఫ్ట్ మూవీ చేసి అందులో అతను నటన పరంగా చాలా వైవిధ్యం చూపించాడని చిరు కితాబిచ్చాడు. ఈ సందర్భంగా ‘అర్జున్ రెడ్డి’లో బాగా ఫేమస్ అయిన ‘ఏమ్మాట్లాడుతున్నావ్ రా..’ డైలాగ్‌ను చిరు ఇమిటేట్ చేయడం విశేషం.

ఏం మాట్లాడుతున్నావ్ రా.. ఏందిరా.. అంటూ చిరు విజయ్ డైలాగ్ చెప్పి.. ఆ తర్వాత వచ్చే మాటను తాను చెప్పకూడదని అన్నాడు. ముందు ‘పెళ్లిచూపులు’ సినిమాలో సాధారణ కుర్రాడిగా నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఆశ్చర్యపరిచాడని.. ఆ పాత్రను అద్భుతంగా పోషించాడని.. ఆ తర్ావత ఇప్పుడు ‘గీత గోవిందం’లో మేడమ్ మేడమ్ అంటూ తనలోని కొత్త కోణాన్ని చూపించాడని చిరు అన్నాడు.

‘అర్జున్ రెడ్డి’ యూత్‌కు కనెక్టవడం వల్ల హిట్టయి ఉండొచ్చని.. కానీ ఆ సినిమా అన్ని వర్గాలకూ చేరువ కాలేదని.. కానీ ‘గీత గోవిందం’ అందరినీ ఆకట్టుకుందని చిరు అన్నాడు. ‘గీత గోవిందం’ చూస్తుంటే తనకు ‘విజేత’ సినిమా గుర్తుకొచ్చిందని కూడా చిరు చెప్పాడు. ‘గీత గోవిందం’ విజయ్‌కి స్టార్ స్టేటస్ ఇచ్చిందని.. ఇది అతడికి మైలురాయి లాంటి సినిమా అని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English