బిగ్‌బాస్‌ ఛీటింగ్‌తో నాని తంటాలు

బిగ్‌బాస్‌ ఛీటింగ్‌తో నాని తంటాలు

బిగ్‌బాస్‌ షో ఎంత పాపులర్‌ అయినా కానీ కంటెస్టెంట్స్‌ ఎంపిక మీదే ఒక సీజన్‌ సక్సెస్‌ ఆధారపడి వుంటుంది. ఈ సీజన్‌లో సరయిన ఆటగాళ్లని ఎంచుకోవడంలో స్టార్‌మా బృందం అట్టర్‌ఫ్లాపయింది. ఆట మీద మినిమం అవగాహన లేకుండా, తమని తాము ఎక్కువ అంచనా వేసుకునే ఆటగాళ్లని ఎంచుకోవడం వల్ల మొదటి రెండు వారాలలోనే షో గాడి తప్పేసింది. జనాన్ని ప్రభావితం చేసేలా ఆట జరగాల్సింది పోయి జనం చేతుల్లోకి గేమ్‌ వచ్చేసింది. దీంతో ఈ సీజన్‌ కాస్తా ప్రేక్షకుల చేతిలో రిమోట్‌ వుంచి హౌస్‌లో వాళ్లతో ఆట ఆడిస్తోన్న చందంగా మారిపోయింది. కౌషల్‌కి విపరీతమైన ఆదరణ పెరగడంతో దానిని తగ్గించడానికి, అతడిని కార్నర్‌ చేయడానికి బిగ్‌బాస్‌ చేయని ప్రయత్నాలు లేవు. ఆట వన్‌ సైడెడ్‌ అయిపోవడంతో హోస్ట్‌ నాని కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఎలాగయినా మిగతా వాళ్లని కూడా ఆటలో భాగం చేయాలని చూస్తోంటే ప్లేయర్స్‌ మాత్రం తల తక్కువగా వ్యవహరిస్తున్నారు. ఇంకా కౌషల్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో హౌస్‌లోని వాళ్లని డైవర్ట్‌ చేయడానికి బయటి నుంచి కాలర్స్‌ కాల్‌ చేస్తున్నట్టుగా ఎవరితోనో ఫోన్‌ చేయించి నచ్చిన వారితో మాట్లాడిస్తున్నారు. కౌషల్‌కి డెబ్బయ్‌ శాతం మంది సపోర్ట్‌ వుంటే, మిగతా అందరికీ మిగిలిన ఓట్లు డివైడ్‌ అవుతున్నాయి. అయినా కానీ కాలర్స్‌ ఎవరూ కౌషల్‌ని పిక్‌ చేసుకోవడం లేదు. ఈ టాక్టిక్‌తో కొందరి కాన్ఫిడెన్స్‌ పెంచి, కౌషల్‌ కాన్ఫిడెన్స్‌ తగ్గించాలనేది బిగ్‌బాస్‌ ప్లాను. ఇదంతా నాని ఎదురుగా జరుగుతూ వుండడంతో అతడినే బ్లేమ్‌ చేస్తున్నారు. అతడే పక్షపాతం చూపిస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుగా అయిన ఈ వ్యవహారం తర్వాత మళ్లీ ఈ షో హోస్ట్‌ చేయడానికి నాని ఇష్టపడతాడా అనేది కూడా అనుమానమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు