మళ్లీ డైరెక్షన్‌లో దిల్‌ రాజు వేలు పెడతాడా?

మళ్లీ డైరెక్షన్‌లో దిల్‌ రాజు వేలు పెడతాడా?

డైరెక్షన్‌లో వేలు పెడుతున్నాడనే వదంతులు బయటకి రావడంతో దిల్‌ రాజు బాగా కంగారు పడ్డాడు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అతను ఈమధ్య బాగా ఇంటర్‌ఫియర్‌ అవుతున్నాడనే టాక్‌ బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా 'శ్రీనివాస కళ్యాణం' చిత్రానికి దిల్‌ రాజు దర్శకుడిని సూపర్‌వైజ్‌ చేసాడనే టాక్‌ బాగా వుంది. అంతకుముందు 'శతమానం భవతి' చిత్రానికి కూడా రాజు ఇదే పని చేసాడట. ఈసారి కూడా తన మీద అపారమైన నమ్మకంతో ఈ చిత్రానికి కూడా అన్ని నిర్ణయాలు తనే తీసుకున్నాడట. తీరా తన గురి తప్పేసరికి డైజెస్ట్‌ చేసుకోవడానికి దిల్‌ రాజుకి చాలా సమయం పట్టింది.

ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిరాదరించడాన్ని నమ్మలేకపోయిన దిల్‌ రాజు ఆడియన్స్‌ రివ్యూ అంటూ ఏదో తాపత్రయపడ్డాడు కూడా. కానీ శ్రీనివాసకళ్యాణం డిజాస్టర్‌ కాకుండా మాత్రం కాపాడలేకపోయాడు. దీంతో ఇక దిల్‌ రాజు తన సినిమాల విషయంలో విపరీతంగా కలుగజేసుకుంటాడా? దర్శకులకి ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వకుండా తన టాలెంట్‌ చూపిస్తాడా? అనే టాక్‌ నడుస్తోంది. గత యేడాది చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాస్‌ అయిపోయిందని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ చూపించిన దిల్‌ రాజుకి ఈ యేడాదిలో వరుసగా రెండు డిజాస్టర్లతో పెద్ద షాకే తగిలింది. లాస్ట్‌ ఇయర్‌ సిక్సర్‌ కొట్టానంటూ సంబరపడ్డ దిల్‌ రాజు ఇప్పుడు హ్యాట్రిక్‌ ఫ్లాపులు రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త వహించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు