హాటే కానీ ఈమె సాయిపల్లవి టైపు కాదు

హాటే కానీ ఈమె సాయిపల్లవి టైపు కాదు

సాయి పల్లవి తర్వాత యువత ఆదరణ బాగా చూరగొంటోన్న యువ హీరోయిన్‌ ఎవరంటే రష్మికా మందాన్నానే. ఛలో, గీత గోవిందం చిత్రాలతో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లు అందుకోవడమే కాకుండా తన నటనతో చాలా మంది అభిమానులని కూడా సంపాదించుకుందీమె. అయితే సాయి పల్లవిలా ఒకే తరహా పాత్రలు చేస్తానని, హీరోయిన్‌కి ప్రాధాన్యముండాలని రష్మిక కండిషన్లు పెట్టడం లేదట. ఎలాంటి పాత్రనైనా చేయడానికి సరేనంటోంది. స్టార్‌ హీరోలతో నటించాలంటే పాత్రలు నచ్చాలని గిరి గీసుకుని కూర్చుంటే కుదరదని రష్మిక గ్రహించింది. అందుకే పర్‌ఫార్మెన్స్‌తో పాటు గ్లామర్‌ ప్రధాన పాత్రలు చేయడానికి కూడా ఆమె అభ్యంతరం చెప్పడం లేదు.

సాయి పల్లవికి క్రేజ్‌ వున్నా కానీ కండిషన్లు చాలా వుండడంతో ఆమెని సంప్రదించడానికి నిర్మాతలు జంకుతున్నారు. రష్మికకి కూడా సిమిలర్‌ క్రేజ్‌తో పాటు ఏ పాత్ర అయినా పోషించడానికి అభ్యంతరాలు లేకపోవడంతో ఈమెకి డిమాండ్‌ బాగా పెరిగిందని అంటున్నారు. ఇంకా అగ్ర హీరోల నుంచి అవకాశాలు రాకపోయినా కానీ ప్రస్తుతానికి మిడ్‌ రేంజ్‌ సినిమాలతో మెడ తిప్పనంత బిజీగా వుంది కన్నడ భామ రష్మిక మందాన్నా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు