నో కాంప్రమైజ్‌... అల్లుడికి తప్పని హెడ్డేక్‌

నో కాంప్రమైజ్‌... అల్లుడికి తప్పని హెడ్డేక్‌

'శైలజారెడ్డి అల్లుడు' చిత్రానికి పోటీగా వస్తోన్న 'నర్తనశాల' నుంచి ఏ సెంటర్స్‌ మరియు ఓవర్సీస్‌లో తలనొప్పులు తప్పవని నాగశౌర్య సినిమాని వాయిదా వేయించాలని చూసారు. ఒక వారం అయినా వాయిదా వేసుకోమని ఆ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొచ్చాయి. సెప్టెంబర్‌ మొదటి వారానికి వాయిదా వేసుకోవాలా వద్దా అని ఆలోచించిన 'నర్తనశాల' నిర్మాతలు ఫైనల్‌గా వాయిదాకి ఒప్పుకోలేదు.

నర్తనశాల బిజినెస్‌ అయిపోవడంతో, బయ్యర్లకి కూడా విడుదల తేదీ వల్ల అభ్యంతరాలు లేకపోవడంతో నిర్మాతలు వాయిదా వేయడానికి అంగీకరించలేదు. నర్తనశాల చిత్రానికి శైలజారెడ్డి అల్లుడు పోటీ కాదు కనుక, రెండు సినిమాల జానర్లు వేరు కనుక వాయిదా అనవసరమని వాళ్లు భావించారట. అయితే ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌ కలక్షన్స్‌పై నర్తనశాల ప్రభావం వుంటుందని భావిస్తోన్న 'శైలజారెడ్డి అల్లుడు' మేకర్స్‌ ఇప్పుడు ఆ పోటీని భరించక తప్పదు.

స్టార్‌ కాస్ట్‌ పరంగా, బిజినెస్‌ పరంగా, మాస్‌ అప్పీల్‌ పరంగా 'శైలజారెడ్డి అల్లుడు'కి అడ్వాంటేజ్‌ వుంటే, కాన్సెప్ట్‌, ఆఫర్‌ చేసే కొత్తదనం పరంగా నర్తనశాల స్కోర్‌ చేసే అవకాశముంది. ఈ చిత్రంలో నాగశౌర్య 'గే' తరహా పాత్ర పోషించడం ఇప్పటికే హాట్‌ టాపిక్‌ అయి ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు