బన్నీ వద్దన్న సినిమా కొత్త హీరోతో?

బన్నీ వద్దన్న సినిమా కొత్త హీరోతో?

సౌత్ ఇండియా అంతటా సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్. అందుకే అతడి మీద వేరే భాషల దర్శక నిర్మాతలు కూడా ఓ కన్నేసి ఉంచుతుంటారు. గత కొన్నేళ్లలో బన్నీతో సినిమా చేయడానికి కోలీవుడ్ దర్శక నిర్మాతలు చాలామంది ట్రై చేశారు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ ఒక సినిమాను కూడా అనౌన్స్ చేసింది ఇంతకుముందు.


కానీ అది అనివార్య కారణాలతో పట్టాలెక్కలేదు. దాని తర్వాత మరో తమిళ స్టార్ డైరెక్టర్ బన్నీతో సినిమా కోసం గట్టిగా ట్రై చేసినట్లు సమాచారం. అతనే.. సుశీంద్రన్. కార్తితో ‘నా పేరు సూర్య’.. విశాల్‌తో ‘పల్నాడు’, ‘జయసూర్య’ లాంటి సినిమాలు తీశాడు సుశీంద్రన్. అతను బన్నీ కోసం ‘జీనియస్’ అనే కథను తయారు చేసుకుని వచ్చి కలిశాడట.
కానీ బన్నీ అది తనకు సూటవ్వదని తిరస్కరించాడట.

ఇప్పుడు ఆ కథనే ఒక కొత్త హీరోగా తీశాడు సుశీంద్రన్. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజైంది. అది చూస్తే ఈ తరం యువతపై చదువుల్ని ఎలా రుద్దుతున్నారో.. ఆ వలలో వాళ్లు ఎలా చిక్కుకుపోయి విలవిలలాడుతున్నారో చెప్పే కథలా ఉందిది. ఐతే ఇలాంటి కథను బన్నీతో చేయాలని సుశీంద్రన్ అనుకున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంది. బన్నీ లాంటి మాస్ హీరోతో ఇలాంటి కథ చేయాలని ఎవరూ అనుకోరు. మరి తమిళ మీడియా మాత్రం ఈ కథ బన్నీ కోసం తయారు చేసిందే అంటోంది.

బన్నీ కాదంటే తమిళంలో మరో స్టార్ హీరోను ట్రై చేయాలి కానీ.. కొత్త కథానాయకుడితో ఈ సినిమా చేయాలని అనుకోరు. మరి ‘జీనియస్’ కథను బన్నీ రిజెక్ట్ చేశాడన్న రూమర్లలో నిజమెంతో చూడాలి. సుశీంద్రన్ చివరగా మన సందీప్ కిషన్ హీరోగా తీసిన ‘కేరాఫ్ సూర్య’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు