పవన్ ఇక అందరినీ ఫాలో అయిపోతాడా?

పవన్ ఇక అందరినీ ఫాలో అయిపోతాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ నాలుగేళ్లలో అతను 32 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. కానీ ఇంతమంది ఫాలోవర్లున్న పవన్.. ఇప్పటిదాకా మాత్రం ఒక్కరినీ ఫాలో కాలేదు. నిన్నటి వరకు పవన్ ఫాలో అవుతున్న వ్యక్తుల సంఖ్య సున్నా. సినిమా.. రాజకీయాలు.. ఇంకే రంగాలకు చెందిన వాళ్లు కూడా ఆయన దృష్టిని ఆకర్షించలేదు. పవన్ ఇక ఎప్పటికీ ఎవరినీ అనుసరించరనే అంతా అనుకున్నారు. కానీ పవన్ ఈ నియమాన్ని బ్రేక్ చేశాడు. అతను తొలిసారిగా ట్విటర్లో ఒక వ్యక్తిని అనుసరించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

పవన్ తాజాగా ఒక దేశభక్తి కవితను ట్విట్టర్లో షేర్ చేశాడు. అది ఒక తమిళ కవితకు ఇంగ్లిష్ అనువాదం. దాన్ని ఏకే రామానుజన్ అనే రచయిత అనువాదం చేశారు. పవన్ దాన్ని తన ఫాలోవర్లతో పంచుకోగా.. ఆశ్చర్యకరంగా అమితాబ్ దాన్ని రీట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయాడు. అమితాబ్‌కు థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఆయన ఫాలోవర్‌గా మారిపోయాడు.  ఎలాగైతేనేం పవన్ తొలిసారిగా ఒక సెలబ్రెటీని అనుసరించడం చర్చనీయాంశమైంది. అమితాబ్ బచ్చన్‌కు తాను వీరాభిమానిని అని పవన్ గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. ఐతే పవన్ అలా అభిమానించే వాళ్లు మరికొంత మంది ఉన్నారు. మరి తనకు తాను గీసుకున్న పరిమితుల నుంచి ఎట్టకేలకు బయటికి వచ్చిన పవన్.. మున్ముందు మరింత మందిని అనుసరిస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English