ఆ అమ్మాయి దేవ‌తన్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ!

ఆ అమ్మాయి దేవ‌తన్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ!

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపుల స‌క్సెస్ ను ద‌ర్శ‌కుడి ఖాతాలో వేసినా.. అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో వేయ‌క త‌ప్పింది కాదు. సుడిగాడు.. ఒక్క సినిమా సక్సెస్ అయిపోతే స‌రిపోతుందా? అన్న మాట వినిపించినా.. అలాంటి వాటిని ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ.. త‌న రేంజ్ ఏమిట‌న్న వైనాన్ని తాజా గీతాగోవిందం సినిమాతో మ‌రోసారి అర్థ‌మ‌య్యేలా చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

సినిమాను ఎంచుకోవ‌టంలో త‌న మార్క్ ను ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. అదే త‌న స‌క్సెస్ మంత్ర అన్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేశాడు. ఇప్పుడు అంద‌రి నోట నానుతున్న గీతాగోవిందం.. ఇప్పుడో ఆస‌క్తిక‌ర టాపిక్ గా మారింది.  వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకెళుతున్న విజ‌య్ నోటి నుంచి ఒక మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. ఇంత‌కీ ఆ అమ్మాయి ఎవ‌రు? అన్న ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌రమైన అంశాన్ని ప్ర‌స్తావించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టివ‌ర‌కూ మీకు ప‌రిచ‌య‌మైన అమ్మాయిల్లో.. అమ్మాయి అంటే ఇలా ఉండాల్రా? అనిపించిన అమ్మాయి ఎవ‌రైనా ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

అమ్మాయి అంటే ఇలా ఉండాల‌ని తాను అనుకోన‌ని.. ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కో స్టైల్ ఉంటుంద‌న్నారు. ఒక‌రిలా మ‌రొక‌రు ఉండ‌లేర‌ని.. త‌న జీవితంలో ఒక అమ్మాయి ఉంద‌ని.. తాను నటుడు కాక‌ముందు నుంచి ప‌రిచ‌యంగా చెప్పారు. అన్ని విష‌యాల్లోనూ చాలా ప్రోత్స‌హించింద‌ని.. మిగిలిన అమ్మాయిల విష‌యం ఏమో కానీ.. త‌ను మాత్రం దేవ‌త‌గా చెప్పారు. ఆమె చుట్టుప‌క్క‌ల ఉన్న వాళ్లంతా అదృష్ట‌వంతులుగా అభివ‌ర్ణించారు. ఇంత‌కీ.. ఆ అమ్మాయి ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు