న‌య‌న్ క్రేజ్ తో ఆరింటికే షో!

న‌య‌న్ క్రేజ్ తో ఆరింటికే షో!

అందాల ముద్దుగుమ్మ‌గా సుప‌రిచిత‌మైన న‌య‌న‌తార‌.. త‌న స‌త్తాను ఇప్ప‌టికే చాటుకుంది. సినిమాల విష‌యంలో ఆమె ఎంపిక కార‌ణంగా స్టార్ స్టేట‌స్ తో పాటు..ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఏళ్లు అవుతున్నా.. ఆమె ఇమేజ్ అంత‌కంత‌కూ పెరుగుతోందే త‌ప్పించి త‌గ్గ‌ట్లేదు. అంతేనా.. సౌత్ లో రూ.6కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసే ఏకైక హీరోయిన్ ఆమె మాత్ర‌మే.

ఇలాంటివ‌న్నీ న‌య‌న్ కు మామూలే. అయితే.. తాజాగా ఆమెకున్న ఇమేజ్ ఇప్పుడు ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌ట‌మే కాదు.. కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ప్రేక్ష‌క ఆద‌ర‌ణ త‌క్కువ‌గా ఉంటుంది. అయితే.. ఇందుకు న‌య‌న మిన‌హాయింపుగా చెప్పాలి. ఇప్ప‌టికే ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అయ్యాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె న‌టించిన కోకో మూవీ ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. కొల‌మావు కోకిల టైటిల్ కు షార్ట్ ఫామ్ గా కోకో గా పిలుస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ త‌మిళ‌నాట ఇప్పుడో సంచ‌ల‌నంగా మారింది. ర‌జ‌నీకాంత్.. అజిత్.. విజ‌య్ లాంటి స్టార్ హీరోల సినిమాల విడుద‌ల సంద‌ర్భంగా చెన్నై మ‌హాన‌గ‌రంలో ఉద‌యం ఆరుగంటలకే షో వేస్తుంటారు. తాజాగా న‌య‌న న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కోకో కు ఆరు గంట‌లకు షో వేశారు.

సెల‌వులు లేని వేళ‌.. ఇలాంటి సాహ‌సం చేస్తారా? అన్న మాట వినిపించినా.. న‌యన క్రేజ్ మీద ఉన్న న‌మ్మ‌కంతో విడుద‌ల చేశారు. అదేమీ త‌ప్పు కాద‌న్నట్లు.. ఉద‌యం ఆరు గంట‌ల షోకే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల ద‌గ్గ‌ర పోటెత్త‌టం చూస్తే.. న‌య‌న ఇమేజ్ అంచ‌నాల‌కు మించిపోయింద‌న్న మాట వినిపిస్తోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు