‘గీత గోవిందం’ను కావాలనే లీక్ చేశారా అంటే..

‘గీత గోవిందం’ను కావాలనే లీక్ చేశారా అంటే..

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ విడుదలకు ముందు దీని లీకేజీ వ్యవహారం ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో తెలిసిందే.  ఈ విషయంలో హీరో విజయ్ దేవరకొండ.. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తీవ్రంగా స్పందించారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే చిత్ర బృందం పబ్లిసిటీ కోసం కావాలనే సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా నడిచింది.

ఈ విషయమై బన్నీ వాసు స్పందించాడు. ఎవరైనా కావాలనే పూర్తి సినిమాను లీక్ చేస్తారా అని అతను ప్రశ్నించాడు. సినిమా లీక్ కావడం వల్ల తమకు నష్టం జరిగిందే తప్ప లాభం లేదన్నాడు. అతనింకా ఏమన్నాడంటే..

‘‘ఎవరైనా పూర్తి సినిమాను కావాలనే లీక్ చేస్తారా? ఒకటి రెండో సీన్లు లీకయ్యాయి అంటే అలా అనుకోవచ్చు. దీనికి సంబంధించిన కేసును హై రేంజ్ పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేశారు. మేం కావాలని లీక్ చేస్తే ఆయన ఈ కేసును టేకప్ చేస్తారా? ఈ ఆరోపణలు అబద్దం. లీకేజీ వల్ల లాభం ఏమీ జరగలేదు. చాలా నష్టమే. కొన్ని కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. చాలా దారుణమిది. దాని వల్ల కలెక్షన్లు తగ్గిపోతాయి. ఇన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా వేరే వాళ్ల ల్యాప్ టాప్‌లో ఉందంటే ఎంత బాధ కలుగుతుంది.  పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దు అని అనిపించింది. ఆ 10 రోజులు నరకం కనిపించింది’’ అని బన్నీ వాసు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English