‘గూఢచారి’ అంత తక్కువలో ఎలా చేశారు?

‘గూఢచారి’ అంత తక్కువలో ఎలా చేశారు?

టాలీవుడ్లో ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన సినిమా ‘గూఢచారి’. కేవలం ఆరు కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ చిత్రంలో కంటెంట్ పరంగా అంతర్జాతీయ ప్రమాణాలు కనిపిస్తాయి. అంత తక్కువ ఖర్చులో ఆ సినిమాను ఎలా పూర్తి చేశారన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఇదంతా తమ ప్లానింగ్ వల్లే సాధ్యమైందని అంటున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమాగా భావించి ఓన్ చేసుకున్నారని.. ఎంతో కష్టపడి.. ఎన్నో త్యాగాలు చేస్తూ సినిమాకు పని చేశారని.. కాబట్టే అంత తక్కువ ఖర్చులో సినిమా పూర్తయిందని అతను తెలిపాడు. మామూలుగా ఎంత చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే.. యూనిట్లో 80 మంది పని చేస్తారని.. కానీ ‘గూఢచారి’కి పని చేసింది 25 మంది మాత్రమే అని శశి తెలిపాడు.
 
ఒక్కొక్కరు మూడేసి పనులు చేసేవాళ్లని.. తాను.. హీరో అడివి శేష్ సైతం కెమెరాలు.. స్టాండ్ బ్యాగులు మోశామని.. నాలుగు రోజులయ్యాక అలసిపోయి పడిపోయేవాళ్లమని తెలిపాడు. రాజమండ్రి ఎపిసోడ్ చేస్తున్నపుడు హీరో శేష్‌తో పాటు కెమెరామన్, ఎడిటర్ తమ ఇంట్లోనేఉన్నారని.. లో బడ్జెట్ సినిమా కావడంతో కనీసం టూస్టార్ హోటల్ కూడా తీసుకోలేదని.. రాజమండ్రిలోనే ఒక త్రీ బెడ్ రూం సర్వీస్ అపార్ట్‌మెంట్లో తమ అసిస్టెంట్లు ఉండేవారని చెప్పాడు. తన ఇంటి నుంచి.. తన అసిస్టెంట్ల ఇళ్ల నుంచి తీసుకొచ్చిన వస్తువులనే సినిమాలో ప్రాపర్టీస్‌గా వాడామన్నాడు. హీరోయిన్ శోభిత తన సొంత దుస్తుల్నే తీసుకొచ్చి సినిమా కోసం ఉపయోగించిందని చెప్పాడు. ఇలా అందరూ సహకరించడం వల్లే అంత తక్కువ ఖర్చులో ‘గూఢచారి’ పూర్తయిందని.. మ్యాన్ పవర్ తక్కువ కావడం వల్లే సినిమా చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టిందని శశి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు