వర్మకు భారతరత్న ఇవ్వాలట

వర్మకు భారతరత్న ఇవ్వాలట

సినీ రంగంలో అపార సేవలందించిన వాళ్లకు ఏటా పద్మ పురస్కారాలు ఇస్తుంటారు. ఐతే సినీ రంగంలో ఎందరినో ఇన్‌స్పైర్ చేసి.. ఇండియన్ సినిమానే గొప్ప మలుపు తిప్పిన రామ్ గోపాల్ వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఏ పురస్కారం దక్కలేదు. ఐతే వర్మకు పద్మ పురస్కారం కాదు.. ఏకంగా దేశ అత్యుతన్నత పౌర పురస్కారం ‘భారతరత్న’నే ఇవ్వాలంటున్నాడు ఆయన శిష్యుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అజయ్.. ఆ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యాడు. సినిమా తీయడంలోనే కాదు.. మాటల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడతను. వర్మ తరహాలోనే బోల్డ్ స్టేట్మెంట్లు, కామెంట్లతో అతను వార్తల్లో వ్యక్తిగా మారాడు.

తాజాగా అతను వర్మకు భారతరత్న ఇవ్వాలంటూ ట్విట్టర్లో కామెంట్ చేసి ఆసక్తికర చర్చకు తెర లేపాడు. దీనిపై ‘ఆర్ఎక్స్ 100’ హీరో స్పందిస్తూ.. గురువు లాగే శిష్యుడూ ఉన్నాడని కామెంట్ చేశాడు. ఇక నెటిజన్లు ఈ కామెంట్‌పై రకరకాలుగా స్పందించారు. వర్మను అడిగినట్లే.. ఇప్పుడు ఎన్నో పెగ్గు మాస్టారూ అని ఒక నెటిజన్ అడిగితే.. ఇంకొకరు వర్మ లాంటి శాడిస్టుకి భారతరత్నా అని ప్రశ్నించాడు. కానీ కొందరు మాత్రం వర్మ నిజంగా గ్రేట్ ఫిలిం మేకర్ అని, అతను ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడని, సినీ రంగానికి సేవలందించాడని.. భారతరత్నకు అర్హుడే అని అన్నారు. కొందరేమో భారతరత్న కాదు కానీ.. మరేదైనా పెద్ద పురస్కారం వర్మకు దక్కాలని అన్నారు. ఇలాంటి కామెంట్లపై వర్మ కూడా ఆసక్తికర రీతిలో స్పందిస్తుంటాడు. మరి ఈ కామెంట్ ఇంకా వర్మ వరకు వెళ్లిందో లేదో మరి. ఒకవేళ వెళ్తే వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు