అన్నాచెల్లెళ్ల బాక్సాఫీస్ వార్

అన్నాచెల్లెళ్ల బాక్సాఫీస్ వార్

మహేష్ బావ సుధీర్ బాబు హీరో కావడానికంటే ముందు ఒక క్యారెక్టర్ రోల్ చేసిన సంగతి చాలా మందికి గుర్తు కూడా ఉండి ఉండదు. అతను ‘ఏమాయ చేసావె’లో సమంతకు అన్నయ్యగా నటించాడు. అందులో సామ్ పేరు జెస్సీ అయితే.. అతడి పేరు జెర్రీ. ఈ ఆన్ స్క్రీన్ అన్నా చెల్లెళ్లు ఇప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారుతున్నారు. వినాయక చవితికి వీళ్లిద్దరి సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. సుధీర్ బాబు సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’ చాన్నాళ్ల కిందటే వినాయక చవితికి రిలీజ్ డేట్‌ను కన్ఫమ్ చేసుకుంది. ఇక సమంత సినిమా ‘యు టర్న్’ కూడా అదే రోజుకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. నిన్ననే ‘యు టర్న్’ ట్రైలర్ లాంచ్ అయింది. అది అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్ చూసి సుధీర్ సైతం స్పందించాడు.

‘ఏమాయ చేసావె’లో జెస్సీ.. జెర్సీగా తామిద్దరం ఎప్పుడూ కొట్టుకునేవాళ్లమని.. ఇప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారామని అతనన్నాడు. ఆ సంగతలా ఉంచితే ‘యు టర్న్’ ట్రైలర్ అదిరిపోయిందని అతను కితాబివ్వడం విశేషం. దీనికి సమంత కూడా స్పందించింది. అయ్యో అలాంటిదేమీ లేదు.. మనిద్దరికీ మంచే జరగాలి అని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది. ఇలా బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారుతూ ఇంత ఫ్రెండ్లీగా ఉండటం విశేషమే. ఈ నెల మొదట్లో విడుదలైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ బృందాలు కూడా ఇలాగే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఒకరి సినిమా గురించి
ఇంకొకరు పాజిటివ్‌గా మాట్లాడారు. ప్రమోషన్లలోనూ సహకరించుకున్నారు. సమంత, సుధీర్ కూడా ఆ ఒరవడినే కొనసాగిస్తుండటం విశేషమే. మరి వీరి బాక్సాఫీస్ పోరులో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు