నిత్యమీనన్.. పూర్తిగా వదిలేసిందే

నిత్యమీనన్.. పూర్తిగా వదిలేసిందే

నిత్యమీనన్ అంత తక్కువ హైట్ ఉన్న హీరోయిన్లు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అరుదు. ఐతే అందం కంటే అభినయంతో అందరినీ ఆకట్టుకోవడం ద్వారా జనాలకు తనలోని ఆ నెగెటివ్‌ హైలైట్ కాకుండా చూసుకుందీ మలయాళ కుట్టి. తెలుగులో తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే ఆమె మెస్మరైజ్ చేసింది. లక్షల మందిని తన అభిమానులుగా మార్చుకుంది. ఆ తర్వాత ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి సినిమాలతో మరింతగా ఇంప్రెస్ చేసిందామె. ఈ ఊపులో నిత్య మరింత పెద్ద రేంజికి వెళ్లాల్సింది. కానీ ఫిజిక్ విషయంలో పూర్తిగా పట్టు తప్పడంతో నిత్య చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయింది. కొంచెం బొద్దుగా ఉన్నా పర్వాలేదు కానీ.. తర్వాత తర్వాత ఆమె మరీ లావైపోయి చూడ్డానికే ఎబ్బెట్టుగా తయారైంది.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘అ!’ నిత్యను చూసి అందరూ షాకైపోయారు. బాడీ మొత్తం మారిపోయి.. ముఖం కూడా ఉబ్బిపోయి చాలా ఇబ్బందికరంగా తయారైంది నిత్య. ఆమె లుక్ చూసి అభిమానులు కూడా చాలా ఫీలయ్యారు. నిత్య విషయంలో పెర్ఫామెన్సే ముఖ్యం కానీ.. మరీ లుక్ ఇంత ఘోరంగా తయారైతే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత అయినా ఆమె మారుతుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. తాజాగా ‘గీత గోవిందం’లోనూ నిత్య అలాగే కనిపించింది. ఒక సీన్లో విజయ్ దేవరకొండ పక్కన ఆమె నడుస్తుంటే చాలా ఆడ్‌గా కనిపించింది. విజయ్ స్లిమ్‌గా, పొడవుగా ఉంటే.. నిత్య పొట్టిగా, చాలా లావుగా అతడి పక్కన ఎబ్బెట్టుగా దర్శనమిచ్చింది. ఈ లుక్ చూసి నిత్య ఫ్యాన్స్ షాకైపోయారంతే. మరీ కాస్తయినా జాగ్రత్త లేకుండా సినిమాల్లో కొనసాగాలనుకుంటే ఎలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిత్య తీరు చూస్తుంటే మాత్రం ఆమెకు లుక్ మార్చుకునే ఉద్దేశాలేమీ లేనట్లే కనిపిస్తోంది. ఆమె ఆలోచన ఇలాగే ఉంటే తెలుగులో ఇంకో సినిమా దక్కడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు