సారీ చెప్పి.. ఫిదా చేసిన స‌మంత‌!

సారీ చెప్పి.. ఫిదా చేసిన స‌మంత‌!

ఎవ‌రికైనా స‌రే త‌ప్పు ఎత్తి చూపిస్తే.. ఒక రేంజ్లో పొడుచుకొస్తుంటుంది. నాలోనే లోపాలు వెతికేస్తావా? అన్న‌ట్లుగా రియాక్ట్ అవుతుంటారు. కానీ.. కొంద‌రు ప్ర‌ముఖులు మాత్రం అందుకు భిన్నం.  స‌రైన త‌ప్పును ఎత్తి చూపిస్తే.. అందుకు థ్యాంక్స్ చెప్పి మ‌రీ.. త‌మ త‌ప్పుల్ని స‌రి చేసుకోవ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా అలాంటి ప‌నే చేసిన స‌మంత‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్రాక్టికల్ గా ఉండ‌ట‌మే  కాదు.. రియ‌లిస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మంత తీరును ప‌లువురు అభినందిస్తున్నారు. ఇంత‌కూ జ‌రిగిందేమంటే..  స‌మంత‌.. రాహుల్ ర‌వీంద్ర‌న్.. ఆది ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన యూట‌ర్న్ మూవీ ట్రైల‌ర్ రిలీజ కావ‌టం తెలిసిందే.

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ మూవీ ట్రైల‌ర్ లో స‌మంత త‌న పాత్ర‌కు తానే డబ్బింగ్ చెప్పుకోవ‌టం క‌నిపించింది. అయితే.. ఆమె వాయిస్ సూట్ కాక‌పోవ‌టం.. పేల‌వంగా ఉంద‌న్న టాక్ వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని సోషల్ మీడియాలో ఒక‌రు స‌మంత దృష్టికి తీసుకొచ్చారు.

స‌మంతా.. మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నా. సినిమా రిలీజ్ అయ్యాక మీ డ‌బ్బింగ్ కు మంచి రివ్యూస్ వ‌స్తాయ‌నే భావిస్తున్నా. యూట‌ర్న్ డ‌బ్బింగ్ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోండ‌ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనికి బ‌దులిచ్చిన స‌మంత‌.. డ‌బ్బింగ్ ను స‌రి చేస్తున్నాం.. సారీ అంటూ బ‌దులిచ్చారు. త‌న‌లోని లోపాన్ని ఎత్తి చూపిస్తే సామ్ అంత పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం బాగుంద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు