కండ‌ల వీరులిద్ద‌రూ క‌లిశారు

కండ‌ల వీరులిద్ద‌రూ క‌లిశారు

బాలీవుడ్లో ఖాన్ త్ర‌యానికి కొంచెం చెక్ పెట్టిన హీరోల్లో హృతిక్ రోష‌న్ ఒక‌డు. హీరోగా తొలి సినిమా క‌హోనా ప్యార్ హైతోనే అత‌ను తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. ఆ త‌ర్వాత కూడా కోయీ మిల్ గ‌యా, క్రిష్‌, ధూమ్-2, అగ్నిప‌థ్, క్రిష్‌-3 లాంటి మంచి హిట్లు ప‌డ్డాయి. ఇప్పుడ‌త‌ను త‌న ఇమేజ్‌కు భిన్నంగా సూప‌ర్ 30 ఆనంద్ క‌థ‌తో తెర‌కెక్కుతున్న వైవిధ్య‌మైన చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇక ఈ త‌రం యంగ్ హీరోల్లో వేగంగా ఎదుగుతున్న క‌థానాయ‌కుడు టైగ‌ర్ ష్రాఫ్‌. ఈ ఏడాది అత‌డి నుంచి వ‌చ్చిన బాగి-2 భారీ విజ‌యాన్నందుకుంది. బ‌డా స్టార్ల సినిమాల‌కు దీటుగా వ‌సూళ్లు రాబట్టింది. విశేషం ఏంటంటే.. హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాఫ్ క‌లిసి ఇప్పుడో సినిమా చేయ‌బోతున్నారు.

ఈ కండ‌ల వీరులిద్ద‌రూ ప్ర‌తిష్టాత్మ‌క య‌శ్ రాజ్ ఫిలిమ్స్ బేన‌ర్లో క‌లిసి న‌టించ‌నున్నారు. ఇంత‌కుముందు హృతిక్ రోష‌న్‌తో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌దికి పైగా దేశాల్లో భారీ ఎత్తున చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఇది పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమా అంటున్నారు. దాదాపు రెండొందల కోట్ల బ‌డ్జెట్లో సినిమా తెరెకెక్క‌నుంది. ఈ చిత్రంలో హృతిక్, టైగ‌ర్ శ‌త్రువులుగా న‌టించ‌నున్నార‌ట‌. యాక్షన్ సినిమాల్లో తిరుగులేని వీళ్లిద్ద‌రూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు భ‌లే మ‌జా గ్యారెంటీ. త్వ‌ర‌లోనే షూటింగ్ ఆరంభించి వ‌చ్చే ఏడాది చివ‌ర్లో సినిమా రిలీజ్ చేస్తార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు