క‌ళ్యాణం వాషౌట్ అయిపోయింది

క‌ళ్యాణం వాషౌట్ అయిపోయింది

అగ్ర నిర్మాత దిల్ రాజు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా ‘శ్రీనివాస క‌ళ్యాణం’. గ‌త నెల‌లో ఆయ‌న బేన‌ర్ నుంచి వ‌చ్చిన ల‌వ‌ర్ డిజాస్ట‌ర్ కాగా.. ఆ విష‌యంలో దిల్ రాజు పెద్ద‌గా బాధ ప‌డ్డ‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్లు కూడా చేయ‌కుండా ఆ చిత్రాన్ని అలా వ‌దిలేశాడంతే.

కానీ ‘శ్రీనివాస క‌ళ్యాణం’ సినిమాను మాత్రం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రాజు.. విడుద‌ల‌కు ముందు, త‌ర్వాత ఓ రేంజిలో ప్ర‌మోష‌న్లు చేశాడు. నెగెటివ్ రివ్యూలు వ‌చ్చినా.. టాక్ డివైడ్‌గా ఉన్నా.. వ‌సూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోయినా రాజు ఆశ‌లు వ‌దులుకోలేదు. స‌క్సెస్ మీట్ పెట్టి సినిమాను పుష్ చేయ‌డానికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాడు. ఐతే శ‌ని, ఆదివారాల్లో కొంచెం పుంజుకున్న‌ట్లు క‌నిపించిన ‘శ్రీనివాస క‌ళ్యాణం’ ఆ త‌ర్వాత ద‌బేల్‌మ‌ని కింద ప‌డింది. అక్క‌డి నుంచి అస‌లు పుంజుకోనే లేదు.

బుధ‌వారం రిలీజైన ‘గీత గోవిందం’ దెబ్బ‌కు ఈ చిత్రం అడ్ర‌స్ లేకుండా పోయింది. ముందు వారాంతం వ‌ర‌కు బాగా ఆడుతున్న ‘గూఢ‌చారి’ సినిమానే ‘గీత గోవిందం’ ముందు నిల‌వ‌లేక‌పోయింది. ఇక ‘శ్రీనివాస క‌ళ్యాణం’ గురించి చెప్పేదేముంది? బుధ‌వారం నుంచి ఈ చిత్ర వ‌సూళ్లు క‌నీస స్థాయిలో కూడా లేవు. ఫుల్ ర‌న్ షేర్ రూ.12 కోట్ల‌కు అటు ఇటు ఆగిపోయేలా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.25 కోట్లకు పైనే జ‌రిగింది. దిల్ రాజుతో బ‌య్య‌ర్ల డీల్స్ వేరుగా ఉంటాయి. న‌ష్టాల‌న్నీ వాళ్లు పూర్తిగా భ‌రించ‌రు. త‌ర్వాతి సినిమాకు న‌ష్టాల్లో కొంత మొత్తం మిన‌హాయించుకుని డ‌బ్బులు క‌డ‌తారు. ఆ ర‌కంగా రాజుకు ‘శ్రీనివాస క‌ళ్యాణం’తో బాగానే బ్యాండ్ ప‌డ‌బోతున్న‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English