లేడీ సూప‌ర్ స్టార్ మ‌ళ్లీ కొట్టింది

లేడీ సూప‌ర్ స్టార్ మ‌ళ్లీ కొట్టింది

30 ఏళ్లు పైబ‌డితే హీరోయిన్ల మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌వుతుంటుంది. కానీ న‌య‌న‌తార కెరీర్ మాత్రం 30కి చేరువ‌య్యాకే మ‌రో స్థాయికి చేరింది. ఇటు స్టార్ హీరోల స‌ర‌స‌న భారీ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ హిట్లు కొడుతూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మంచి విజ‌యాలందుకుని త‌న ఇమేజ్‌ను పెంచుకునంది న‌య‌న్. ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ అన‌డంలో అతిశ‌యోక్తి ఏమీ లేదు.
మయూరి’.. ‘కర్తవ్యం’ లాంటి సినిమాలతో ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలూ అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి విజయం సాధించాయి. తాజాగా ఆమె నుంచి వ‌చ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కోల‌మావు కోకిల‌’. ఈ చిత్రం శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

‘కోల‌మావు కోకిల‌’ను న‌య‌న్ కెరీర్లో మ‌రో మంచి సినిమాగా చెబుతున్నారు. ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ. ఈ చిత్రానికి న‌య‌న్ త‌న భుజాల మీద న‌డిపించిందంటున్నారు. ఆమె లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్.. న‌టన గురించి గొప్ప‌గా చెబుతున్నారు. రివ్యూల‌న్నీ పాజిటివ్ గానే వ‌చ్చాయి. 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఆమె ఒక చోటి నుంచి మరో చోటికి చేర్చాల్సి వస్తుంది. ఇందు కోసం ఆమె తన తల్లిదండ్రులు.. చెల్లి.. తనను ప్రేమించే ఒక కమెడియన్ని వెంట బెట్టుకుని ఒక వ్యాన్లో ప్రయాణం చేయడం మొదలుపెడుతుంది.

ఈ క్రమంలో వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నదే ఈ కథ. ఇందులో నయన్ ను ప్రేమించే పాత్రలో కమెడియన్ యోగిబాబు నటించడం విశేషం. వీళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు భ‌లేగా పేలాయ‌ట‌. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి విడుద‌ల కావాల్సింది. కానీ ఇక్క‌డ ఆల‌స్యంగా రిలీజ్ చేయ‌నున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు