వీకెండ్లోనే 25 కోట్లు?

వీకెండ్లోనే 25 కోట్లు?

ఈ బుధ‌వారం విడుద‌లైన ‘గీత గోవిందం’ సినిమా అంచ‌నాల్ని మించిపోతోంది. దీని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే ఓపెనింగ్స్ క‌ళ్లు చెదిరే రీతిలో ఉంటాయ‌ని అంచ‌నా వేశారు ట్రేడ్ పండిట్లు. ఐతే రిలీజ్ రోజు అదిరిపోయే టాక్ రావ‌డంతో ఆ అంచ‌నాల్ని కూడా సినిమా మించిపోతోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే గ్రాస్ రూ.25 కోట్ల‌కు చేరువ‌గా ఉండ‌టం విశేషం. షేర్ రూ.15 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. మూడో రోజుకే సినిమా బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. శుక్ర‌వారం కూడా వ‌సూళ్లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. ఇక వీకెండ్లో క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. శ‌ని.. ఆదివారాల‌కు అడ్వాన్స్ బుకింగ్స్ పూర్త‌య్యాయి. టికెట్లు దొరికే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

తొలి వీకెండ్‌కే ‘గీత గోవిందం’ రూ.25 కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మామూలుగా బ‌డా హీరోల‌కు మాత్ర‌మే ఈ రేంజి వ‌సూళ్లు వ‌స్తుంటాయి. ఈ స్థాయి వ‌సూళ్లు సాధించే హీరోలు టాలీవుడ్లో అర‌డ‌జ‌ను మందికి మించి లేరు. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజుకి తోడు.. సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండ‌టం.. అదిరిపోయే టాక్ రావ‌డం.. పోటీలో మ‌రే సినిమా లేక‌పోవ‌డం ‘గీత గోవిందం’కు పూర్తిగా క‌లిసొస్తోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాక క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల్లో.. అమెరికాలో ఈ చిత్రం అద‌ర‌గొడుతోంది. యుఎస్‌లో ఈ చిత్రం మిలియ‌న్ మార్కుకు చేరువ‌గా ఉంది. వీకెండ్ వ‌సూళ్లు 1.3 మిలియ‌న్ మార్కును దాటుతాయ‌ని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు