అప్పుడు మిస్సయిన‌ చిరు .. ఇప్పొడొస్తున్నాడు

అప్పుడు మిస్సయిన‌ చిరు .. ఇప్పొడొస్తున్నాడు

విశాఖపట్నంలో జరిగిన ‘గీత గోవిందం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలవాలని నిర్మాత అల్లు అరవింద్ భావించాడు. కానీ ఆ వేడుక చేయడానికి కొన్ని రోజుల ముందు ఈ చిత్రం నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయి గందరగోళం నెలకొనడం.. చిత్ర బృందమంతా డిస్టర్బ్ కావడంతో చిరును ఆ వేడుకకు పిలవాలన్న ఆలోచనను పక్కన పెట్టారు. ఒక దశలో ఆ వేడుకనే రద్దు చేయాలన్న ఆలోచన కూడా చేశారు కానీ.. తర్వాత మనసు మార్చుకుని యధావిధిగా ఈవెంట్ చేశారు. చిరు అప్పుడు మిస్సయినా.. ‘గీత గోవిందం’ సినిమా రిలీజయ్యాక దీని కోసం టైం కేటాయిస్తున్నాడు. ఆల్రెడీ చిత్ర బృందంతో కలిసి ఆయన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో షో చూసి అందరినీ అభినందించిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంగా చిరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని అనుకున్నారు కానీ.. అదేమీ జరగలేదు. అందుకు కారణం లేకపోలేదు. ఈ చిత్ర సక్సెస్ మీట్‌కు చిరు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఈ నెల 19న హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. దీనికి చిరు చీఫ్ గెస్ట్‌గా వస్తాడని ఈ రోజే ప్రకటించారు. మొత్తానికి చిరు సేవల్ని విడుదల తర్వాత అరవింద్ బాగానే ఉపయోగించుకుంటున్నాడు. చిరు ఈ మధ్య తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అల్లుడు కళ్ాయణ్ దేవ్‌ల సినిమాల్ని ప్రమోట్ చేసి పెట్టాడు. కానీ అవేవీ మంచి ఫలితాన్నివ్వలేదు. ఐతే ఆల్రెడీ హిట్టయిన ‘గీత గోవిందం’కు ఆయన సపోర్ట్ అవసరం లేకపోయినా అరవింద్ చిరును లైన్లో పెట్టాడు. సక్సెస్ మీట్ నిర్వహించే సమయానికే లాభాల్లోకి వెళ్లబోతున్న ఈ చిత్రం.. ఆ తర్వాత ఇంకెంత స్థాయికి వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు