శైలజారెడ్డి అల్లుడికి టెన్షన్‌

శైలజారెడ్డి అల్లుడికి టెన్షన్‌

ప్రస్తుతం ఏ సినిమా జాతకాన్ని అయినా తేల్చేస్తోంది ట్రెయిలర్‌. అది చూసి సినిమా ఎలా వుంటుందోననే అంచనాకి వచ్చేసి సదరు సినిమా చూడాలా వద్దా అని ప్రేక్షకులు డిసైడైపోతున్నారు. దీంతో ట్రెయిలర్‌ కట్‌ చేయడంపై దర్శకులు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. గీత గోవిందం చిత్రానికి టీజర్‌తోనే క్రేజ్‌ బాగా వచ్చేయడంతో ట్రెయిలర్‌ విడుదల చేయనే లేదు.

గూఢచారి చిత్రం ట్రెయిలర్‌కి వచ్చిన స్పందనతోనే సూపర్‌హిట్‌ అనే ఫీలింగ్‌ వచ్చేసింది. శ్రీనివాస కల్యాణం భవిష్యత్తుని ట్రెయిలరే తేల్చేసింది. ఇదంతా చూస్తూ 'శైలజా రెడ్డి అల్లుడు'కి ఎలాంటి ట్రెయిలర్‌ కట్‌ చేయాలనే దానిపై మారుతి చాలా టెన్షన్‌ పడుతున్నాడట. అందుకే ఆల్రెడీ రెండు ట్రెయిలర్స్‌ రెడీ అయినా కాన్సిల్‌ చేసుకున్నారట.

సినిమా విడుదలకి వారం ముందు ట్రెయిలర్‌ వదలాలని, అది కూడా చాలా చాలా బాగుండేలా, చూడగానే సినిమా చూడాలనిపించేలా వుండేట్టు చూసుకోవాలని భావిస్తున్నారట. ఈ చిత్రం టీజర్‌ అయితే నాసిరకంగానే వుందనే పేరొచ్చింది. మరి ట్రెయిలర్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కట్‌ చేస్తారా లేక ఎందుకొచ్చిన గొడవ అని ట్రెయిలర్‌ లేకుండానే వచ్చేస్తారా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు