మంచు వారికి మెగా హీరో కంచె

మంచు వారికి మెగా హీరో కంచె

మనం ఇన్వెస్ట్‌ చేసిన ల్యాండ్‌ వేల్యూ ఒకేసారి పెరిగితే ఎంత ఎక్సయిటింగ్‌గా వుంటుందో, అడ్వాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ పెద్ద హిట్‌ ఇస్తే అంతకు మించిన ఎక్సయిట్‌మెంట్‌ వుంటుంది ప్రొడ్యూసర్లకి. డైరెక్టర్‌ పరశురామ్‌పై ఇన్వెస్ట్‌ చేసిన నిర్మాతల పరిస్థితి అలాగే వుందిప్పుడు. గీత గోవిందంతో పరశురామ్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. అతనికి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు పార్టీలు చేసేసుకుంటున్నారు.

అంత పెద్ద హిట్‌ ఇచ్చిన దర్శకుడి మలి చిత్రం తమతో వుంటుందంటే ఎవరికి ఆనందం వుండదు? కాకపోతే పరశురామ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాతలలో ఎవరికీ ఫలానా డేట్‌కి సినిమా చేసిస్తానని మాట ఇవ్వలేదు. దీంతో వాళ్లంతా అతని కోసం వెయిట్‌ చేయక తప్పదు. పరశురామ్‌కి ఎప్పుడో జమానాలో అడ్వాన్స్‌ ఇచ్చిన మంచు విష్ణు వెంటనే అతనితో ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అయితే గీతా ఆర్ట్స్‌ పెంచుకున్న ఈ చెట్టుకి కాసిన పళ్ళని మంచు వాళ్లు కోసుకోకుండా కంచె వేసేస్తున్నారు. ఇంకా అతని వద్ద కథ ఏమీ సిద్ధంగా లేకపోయినా కానీ వరుణ్‌ తేజ్‌తో ఒక మాట అనేసుకుంటున్నారు. పరశురామ్‌ మలి చిత్రం కూడా గీతా ఆర్ట్స్‌లోనే వుంటుంది. వరుణ్‌తో ఇంకా సినిమా తీయని గీతా ఆర్ట్స్‌లో అతనికి ఇదే తొలి చిత్రమవుతుంది.

అయితే తమతోనే ముందుగా సినిమా చేయాలంటూ పరశురామ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాతలు కొందరు ఛాంబర్‌ని ఆశ్రయించబోతున్నారని టాక్‌ వుంది. నిన్న మొన్నటి వరకు నెక్స్‌ట్‌ సినిమా ఎప్పుడని చూసిన డైరెక్టర్‌కి ఒకేసారి గీత మారిపోయి నెక్స్‌ట్‌ సినిమా మొదలు పెట్టడానికి అరడజను మంది క్యూలో వున్నారిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు