మిడిల్‌ క్లాస్‌ హీరోలకి మరో మొగుడు

మిడిల్‌ క్లాస్‌ హీరోలకి మరో మొగుడు

మహేష్‌, తారక్‌, చరణ్‌, ప్రభాస్‌, బన్నీ... ఇలా అగ్ర పథాన వున్న హీరోలెవరనే దానిపై ఎలాంటి సందిగ్ధాలు లేవు కానీ ఆ తర్వాతి శ్రేణి హీరోల మధ్య మాత్రం పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ టేబుల్‌లో వున్న హీరోలకి ప్రతి సినిమాతో పరీక్ష ఎదురవుతోంది. నిన్న మొన్నటి వరకు సేఫ్‌గా వున్న నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి హీరోలకి ఇప్పుడు తలనొప్పి వస్తోంది.

వరుస వైఫల్యాల మాట అటుంచితే, తమ పోటీదారులైన హీరోలు నానాటికీ పెద్ద రేంజ్‌కి వెళ్లిపోతూ వుండడంతో ఈ రేంజ్‌లో వున్న హీరోలు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ మిడ్‌ రేంజ్‌ టేబుల్‌కి లీడర్‌గా వున్న నానికి ఇప్పుడు విజయ్‌ దేవరకొండనుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. నాని కంటే కూడా యూత్‌లో ఎక్కువ ఫాలోయింగ్‌ వున్న విజయ్‌ దేవరకొండకి ఫ్యామిలీ ఆడియన్స్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.

ఇక వరుణ్‌ తేజ్‌ కూడా నెమ్మదిగా పెద్ద రేంజ్‌కి వెళుతున్నాడు. నాగశౌర్య లాంటి హీరోలు నిచ్చెన వేసుకుని ఈ స్థాయికి చేరుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే నాని మిస్‌ చేసుకున్న లేదా రిజెక్ట్‌ చేసిన కథలతో కాలక్షేపం చేస్తోన్న మిడిల్‌ క్లాస్‌ హీరోలకి విజయ్‌ దేవరకొండ రైజ్‌తో ఇంకా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇప్పుడు ఈ హీరోలని దాటి మిగతా వారికి చెప్పుకోతగ్గ కథలు దొరకడమనేది ఆషామాషీ విషయం కానే కాదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు