భార్య పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఎన్టీఆర్‌!

భార్య పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఎన్టీఆర్‌!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నారనేగానీ ఎక్కడ మొదలు పెడతారు, ఎక్కడి వరకు చూపెడతారు అనేది అభిమానులని తొలుస్తోన్న ప్రశ్న. మొదట ఈ చిత్రానికి ఏదో స్క్రీన్‌ప్లే అనుకున్నారట గానీ తర్వాత క్రిష్‌ రాకతో అది మారిందట.

అయితే ఎన్టీఆర్‌ చివరి దశని చూపించరాదని, చంద్రబాబుని విలన్‌ చేయవద్దని కండిషన్‌ మాత్రం పెట్టాడట బాలకృష్ణ. దీంతో ఈ పాయింట్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ కథని ఎక్కడ ఎండ్‌ చేయాలనే దానిపై క్రిష్‌ ఒక అంచనాకి వచ్చాడట. ఇందులో భాగంగానే ఈ కథని ఊహించని విధంగా ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెబుతున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే ఆ పాత్రకి అంత ఖర్చు పెట్టి విద్యాబాలన్‌ని తీసుకున్నారట.

ఆమె ఈ చిత్రానికి నెరేటర్‌గా వ్యవహరిస్తుందని, తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఎన్టీఆర్‌ ఎలాంటి వాడు, ఎలా ఎదిగాడు, కుటుంబంతో ఎలా వుండేవాడు వగైరా అన్నీ చర్చించబోతున్నారని, బాలకృష్ణకి కూడా ఈ యాంగిల్‌ బాగా నచ్చిందని సమాచారం. బాలకృష్ణని గ్రాఫిక్స్‌ సాయంతో కుర్రాడిగా చూపిస్తున్నారని, ఎన్టీఆర్‌ వయసు పెరిగిన తర్వాతి గెటప్‌ కోసం విదేశీ మేకప్‌ నిపుణులని తీసుకొచ్చారని తెలిసింది. సావిత్రి కథకే అంతటి కమర్షియల్‌ రీచ్‌ వున్నపుడు ఎన్టీఆర్‌ కథకి దానికి రెండింతలు వుంటుందనే ధీమాతో ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English