మంచు వారు భలే లాక్ చేసి పెట్టారే..

మంచు వారు భలే లాక్ చేసి పెట్టారే..

‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఇప్పటిదాకా మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చిన అతను.. ఈ సినిమాతో తన స్థాయి ఎంతో పెంచుకున్నాడు. ఇప్పుడు పెద్ద హీరోలు సైతం అతడితో పని చేయడానికి రెడీ అవడం ఖాయం. పెద్ద బడ్జెట్లలో భారీ సినిమాలు చేసే అవకాశం పరశురామ్‌కు దక్కుతుందనే అనుకుంటున్నారంతా. కాలం కలిసొస్తే అల్లు అర్జున్‌ లాంటి బడా స్టార్‌తోనూ పరశురామ్ సినిమా చేసే అవకాశముంది.

కానీ తాను స్ట్రగుల్లో ఉండగా పరశురామ్ ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పడు అతడికి ఇబ్బందికరంగా మారింది. తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడో ఏమో కానీ.. భవిష్యత్తులో మంచు విష్ణుతో అతను ఒక సినిమా చేయక తప్పదు. ఎందుకంటే ‘శ్రీరస్తు శుభమస్తు’ చేస్తున్న సమయంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బేనర్లో ఓ సినిమా చేయడానికి అతను కమిట్మెంట్ ఇచ్చాడట. అందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఐతే ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయవంతమై.. మళ్లీ గీతా ఆర్ట్స్-2 బేనర్లోనే ‘గీత గోవిందం’ చేయాల్సి రావడం.. మంచు విష్ణు కూడా వేరే కమిట్మెంట్లతో ఉండటంతో వీళ్ల కాంబినేషన్లో వెంటనే సినిమా మొదలు కాలేదు.

ఐతే ఇప్పుడు ‘గీత గోవిందం’ పెద్ద హిట్టయి పరశురామ్ రేంజే మారిపోయింది. ఇది మంచు ఫ్యామిలీకి ఆనందాన్నిచ్చే విషయమే. కొంచెం ముందో వెనుకో పరశురామ్.. విష్ణుతో సినిమా చేయక తప్పదు. మంచు ఫ్యామిలీలోని అందరూ ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. విష్ణు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. అతడి నుంచి చివరగా వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ దారుణ ఫలితాన్నందుకుంది. మరి పరశురామ్ అతడితో ఎప్పుడు సినిమా చేస్తాడో.. ఎలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు