స‌మంత క్రాక‌ర్స్ తో `గోవింద్` సెల‌బ్రేష‌న్స్!

స‌మంత క్రాక‌ర్స్ తో `గోవింద్` సెల‌బ్రేష‌న్స్!

విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక మంద‌నల కాంబోలో తెర‌కెక్కిన `గీత గోవిందం` హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగ‌తి తెలిసిందే. యాంగ‌ర్ మేనేజ్ మెంట్ లో జీరో మార్కులు తెచ్చుకున్న‌ `అర్జున్ రెడ్డి`....`గోవిందం`గా బుద్ధిమంతుడి పాత్ర‌లో 100 మార్కులు కొట్టేశాడు. గీత‌, గోవింద్ ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావడంతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా`గీత గోవిందం`కు ఫిదా అయ్యారు. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌నూ ఆక‌ట్టుకున్న ఈ చిత్రంపై చిరంజీవి, రాజ‌మౌళి, మ‌హేష్ బాబు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ జాబితాలో స‌మంత‌, సాయి ధ‌రమ్ తేజ్, సుశాంత్ అక్కినేని చేరారు. స‌మంత ఫొటో వేసి ఉన్న క్రాక‌ర్స్ తో గీత గోవిందం సెల‌బ్రేష‌న్స్ అదిరిపోయాయ‌ని విజ‌య్ ట్వీట్ చేయ‌గా....సినిమా చూశాన‌ని, చాలా బాగుంద‌ని సామ్ రిప్లై ఇచ్చింది.  ఆ ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

త‌న ఫేవ‌రెట్ న‌టి సమంత ఫొటో ఉన్న క్రాక‌ర్స్ (కాక‌ర‌పువ్వొత్తులు)తో సెలబ్రేట్‌ చేసుకుంటున్నా అని ఆ క్రాక‌ర్స్ ఫొటోను విజ‌య్ ట్వీట్ చేశాడు. దానికి స‌మంత రీట్వీట్ చేసింది. ``గీత గోవిందం చూశాను. చాలా బాగుంది. విజ‌య్, రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌లిసి న‌టించిన ప్ర‌తి సినిమా చూస్తాను. వీరిద్ద‌రిదీ సూప‌ర్ కాంబినేష‌న్. వెన్నెల కిషోర్, ర‌ష్మిక‌ల‌తో పాటు చిత్ర యూనిట్ కు శుభాకాంక్ష‌లు.``అని సామ్ ట్వీట్ చేసింది. గీత గోవిందంలో లీడ్ పెయిర్ విజ‌య్, ర‌ష్మిక‌లు అద‌ర‌గొట్టార‌ని, జోడీ చాలా బాగుంద‌ని తేజూ ట్వీట్ చేశాడు. బ‌న్నీ వాస్, రాహుల్ రామ‌కృష్ణ‌, ప‌ర‌శురామ్ ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. యాంగ్రీ మ్యాన్ నుంచి ప్లీజ్ మేడ‌మ్ అనే అణ‌కువ ఉన్న యువ‌కుడి పాత్ర‌లో విజ‌య్ అద్భుతంగా న‌టించాడు అని సుశాంత్ ట్వీట్ చేశాడు. ల‌వ్ లీ మేడ‌మ్ ర‌ష్మిక బాగా న‌టించింద‌ని సుశాంత్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు