జక్కన్నా.. ఎన్టీఆర్ టీజర్‌పై మాట్లాడవా?

జక్కన్నా.. ఎన్టీఆర్ టీజర్‌పై మాట్లాడవా?

ఏదైనా కొత్త సినిమాకు రాజమౌళి కాంప్లిమెంట్స్ ఇస్తే దాన్ని ఒక సర్టిఫికెట్ లాగా భావిస్తుంది ఆ చిత్ర బృందం. రాజమౌళి ట్విట్టర్లో ఇలా ఒక సినిమా గురించి స్పందించడం ఎప్పుడో కానీ జరగదు. చివరగా జక్కన్న ‘సమ్మోహనం’ సినిమా గురించి స్పందించాడు. దాని గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. తన మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ గురించి రిలీజ్ ముందు మాట్లాడాడు కానీ.. విడుదలయ్యాక తనేమీ రివ్యూ ఇవ్వలేదు. తాజాగా ఆయన దృష్టిని ఓ సినిమా ఆకర్షించింది. అదే.. గీత గోవిందం. నిన్న ఉదయం ఎప్పట్లాగే ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసిన జక్కన్న.. దీనిపై ప్రశంసల జల్లు  కురిపించాడు.

‘గీత గోవిందం’ నవ్వుల విందే అని జక్కన్న అన్నాడు. అనుకోకుండానో.. మరెలాగో కానీ.. హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత పూర్తి భిన్నమైన సినిమా ఎంచుకున్నాడని.. అతను అదరగొట్టేశాడని జక్కన్న కితాబిచ్చాడు. తనేం చేస్తున్నాడో అతడికి బాగా తెలుసని అన్నాడు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉందని..  పరశురామ్ రచన, దర్శకత్వం రెండింట్లోనూ రాణించాడని రాజమౌళి ప్రశంసించాడు. అన్నపూర్ణ, వెన్నెల కిషోర్‌ల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన జక్కన్న.. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపాడు. ఐతే ఈ ట్వీట్ విషయంలో చాలా మంది సానుకూలంగానే స్పందించారు కానీ.. ఇదే రోజు రిలీజైన రాజమౌళి మిత్రుడు ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ గురించి ఆయన స్పందించలేదేంటి అంటూ తారక్ అభిమానులు ప్రశ్నించారు. ఎన్టీఆర్ మీద జక్కన్నకు ఎంతటి అభిమానమో తెలిసిందే. పైగా తారక్‌తో సినిమా కూడా చేయబోతూ అతడి తాజా టీజర్ మీద జక్కన్న మాట్లాడకపోవడం అభిమానుల్ని నొప్పించినట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English