ప్రిన్స్ ను ఆక‌ట్టుకున్న `గోవిందం`!

ప్రిన్స్ ను ఆక‌ట్టుకున్న `గోవిందం`!

విజయ్ దేవరకొండ, రష్మిక మంద‌నాల కాంబోలో తెర‌కెక్కిన ‘గీత గోవిందం’ బుధవారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పాజిటివ్ బ‌జ్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవ‌ర్సీస్ లో కూడా మంచి టాక్ సొంతం చేసుకుని మిలియన్ మార్క్ ను రీచ్ అయ్యేందుకు దూసుకుపోతోంది.

`అర్జున్ రెడ్డి` వంటి అగ్రెసివ్ పాత్ర‌లో న‌టించిన విజ‌య్....`విజ‌య్ గోవిందం` వంటి స‌బ్ మిసివ్ పాత్ర‌లోకి ట్రాన్స్ ఫార్మ అయిన వైనానికి ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కులు, సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా చూసిన ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి...విజ‌య్, చిత్ర యూనిట్, ప‌రశురాం పై ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

`గీత గోవిందం`చిత్రానికి మంచిరేటింగ్స్, రివ్యూలు వ‌చ్చిన నేప‌థ్యంలో రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను విజ‌య్ న‌టన‌ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అమాయ‌కుడిగా క‌నిపించే విజయ్...ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. ర‌ష్మిక‌, విజ‌య్ ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో మంచి ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమా నిలిచింది.

విజ‌య్ గోవిందం ....మ‌హేష్ బాబును కూడా ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాను  ప్రశంసిస్తూ మ‌హేష్ బాబు ట్వీట్ చేశాడు. ‘‘గీత గోవిందం ఒక విన్నర్. సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను.విజయ్ దేవరకొండ, రష్మిక అద్భుతంగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో స్పెషల్‌గా చెప్పుకోదగ్గ వ్యక్తులు. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అని మహేష్ ట్వీట్ చేశారు. ప్రిన్స్ ట్వీట్ కు వెన్నెల కిషోర్  స్పందించాడు. ‘‘ఈ రోజును నాకు చాలా ప్రత్యేకంగా మార్చారు సార్. మిలియన్ థాంక్స్ మీకు. రియల్లీ స్వీట్ ఆఫ్ యు’’ అంటూ నమస్కారం పెడుతూ వెన్నెల కిషోర్ ట్వీట్ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు