ప్రియాంక ఎంగేంజ్ మెంట్ రింగ్ వెనుక బోలెడంత క‌థ‌

ప్రియాంక ఎంగేంజ్ మెంట్ రింగ్ వెనుక బోలెడంత క‌థ‌

బాలీవుడ్ ఆపై గ్లోబ‌ల్ న‌టిగా ఎదిగిన ప్రియాంక చోప్రా.. త్వ‌రలో పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. త‌న కంటే బాగా చిన్నోడైన హాలీవుడ్ న‌టుడు క‌మ్ సింగ‌ర్ నిక్ జొనాస్ తో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయిన ఆమెకు ముచ్చ‌ట ఆ మ‌ధ్య‌న మీడియాలో భారీ ఎత్తున రావ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఆమె పెళ్లి జ‌ర‌గ‌నున్నట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ అమెరికాలో జ‌రిగింది. స‌న్నిహితుల సమ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లుగా ప్రియాంక వెల్ల‌డించారు. తాజాగా ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీశ్ మల్హోత్రా త‌న ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీలో ప్రియాంక చెప్రా పాల్గొంది. ఈ సంద‌ర్భంగా త‌న ఎంగేంజ్ మెంట్ ముచ్చ‌ట‌తో పాటు.. ఆమె చేతికి  నిక్ తొడిగిన ఎంగేంజ్ మెంట్ రింగ్ వెన‌కున్న క‌థ‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న వేలికి నిక్ తొడిగిన వ‌జ్ర‌పు ఉంగ‌రాన్నిచూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఉంగ‌రం విలువ మ‌న రూపాయిల్లో దాదాపు కోటికి పైనే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ రింగ్ లో నాలుగు క్యార‌ట్ల వ‌జ్రాలు ఉన్నాయ‌ట‌. ఇంత విలువైన ఉంగ‌రాన్ని ప్రియాంక‌కు ప్ర‌జెంట్ చేసేందుకునిక్ చాలానే శ్ర‌మ‌ను తీసుకున్నాడ‌ట‌.

లండ‌న్ లోని ప్ర‌ముఖ అమెరిక‌న్ జ్యువెల‌రీ సంస్థ టిఫ‌నీ అండ్ కో షాపుకు వెళ్లిన ఆయ‌న ఒక రోజు మొత్తం వెచ్చించి మ‌రీ ఈ రింగ్‌ను సెలెక్ట్ చేశాడ‌ట‌. నిక్ షాపింగ్ కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు వీలుగా.. ఆ రోజుంతా ఆ షాపును మూసి ఉంచి.. నిక్ రింగ్ సెలెక్ష‌న్ కు షోరూం వారు స‌హ‌క‌రించార‌ట‌. త‌న కోసం త‌న ప్రియుడు చేసిన ప‌నికి ప్రియాంక ఏముంది..  ఎవ‌రు మాత్రం ఫిదా కాకుండా ఉంటారు చెప్పండి. మ‌రో విష‌యం ఆగ‌స్టు 18న త‌న స్నేహితుల కోసం ప్రియాంక‌.. నిక్ లు భార‌త్ లో ఘ‌నంగా పార్టీ ఇవ్వ‌నున్నార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English