ప్రిమియర్లతోనే హాఫ్ మిలియనా?

ప్రిమియర్లతోనే హాఫ్ మిలియనా?

విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా అమెరికాలో ఇరగాడేసింది. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై ఏకంగా 2 మిలియన్ క్లబ్బులోకి చేరింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అమెరికాలో అతి పెద్ద విజయం సాధించిన తెలుగు సినిమాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడు విజయ్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘గీత గోవిందం’ కూడా యుఎస్‌లో వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. విజయ్ క్రేజుకి తోడు చక్కటి ప్రోమోలు కూడా తోడవడంతో విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుందీ చిత్రం. ఆ హైప్ ఎలాంటిదన్నది ప్రిమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్‌ను బట్టే తెలుస్తోంది. ఈ చిత్రానికి 130కి పైగా లొకేషన్లలో పెద్ద ఎత్తున ప్రిమియర్లు ప్లాన్ చేశారు.

మంగళవారం ఉదయానికే ఈ చిత్రం ప్రి సేల్స్ ద్వారా 1.5 లక్షల డాలర్లు రాబట్టడం విశేషం. మొత్తం ప్రిమియర్లు అయ్యేసరికే ‘గీత గోవిందం’ హాఫ్ మిలియన్ మార్కును అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మామూలుగా పెద్ద స్టార్లకు మాత్రమే ప్రిమియర్లతో ఈ ఘనత సాధ్యమవుతుంది. నిజానికి కొందరు స్టార్లు కూడా ఈ ఫీట్‌ను అందుకోలేరు. మరి విజయ్ ఆ ఘనత సాధిస్తే గొప్ప విషయమే. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ వీకెండ్లోపే మిలియన్ మార్కును ఈజీగా టచ్ చేసేస్తుంది ‘గీత గోవిందం’. ఫుల్ రన్లో ‘అర్జున్ రెడ్డి’ వసూళ్లను దాటడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. యుఎస్ బాక్సాఫీస్‌లో చివరగా భారీ వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ‘మహానటి’. దాని తర్వాత మిలియన్ మార్కును కూడా ఏ సినిమా అందుకోలేదు. ‘గీత గోవిందం’ ఈజీగా ఆ క్లబ్బులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఏమేరకు కలెక్షన్లు తెస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు