ఫ్లాప్ క్యారెక్టర్లను ఈసారి హిట్ చేస్తారా?

ఫ్లాప్ క్యారెక్టర్లను ఈసారి హిట్ చేస్తారా?

తెలుగువాడైన ఆది పినిశెట్టి తమిళంలో నటుడిగా నిలదొక్కుకుని.. ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూశాడు. ఈ క్రమంలో అతను కొన్నేళ్ల కిందటే ‘గుండెల్లో గోదారి’ సినిమాలో నటించాడు. ఆ చిత్రం డిజాస్టర్ అయింది. అందులో ఆది చేపలు పట్టే ఒక పేద కుర్రాడి పాత్రలో నటించాడు. అతడికి జోడీగా తాప్సి నటించింది. ఆమెది పెద్దింటి కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర. ఆది ఫిజిక్ చూసి వెర్రెత్తిపోయి అతడి మైకంలో పడిపోతుందామె. తాప్సి పాత్రను కొంచెం వల్గర్‌గా చూపించారని అప్పట్లో విమర్శలొచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్ పాత్ర చూస్తే ‘గుండెల్లో గోదారి’లో తాప్సి క్యారెక్టర్ గుర్తుకొస్తే ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే ‘గుండెల్లో గోదారి’లో తాప్సి పాత్రను కొంచెం సున్నితంగా, షుగర్ కోటింగ్‌తో చూపించారు. కానీ ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ రాజ్ పుత్ పాత్ర పచ్చిగా, బోల్డ్‌గా ఉంటుంది.

విశేషం ఏంటంటే ‘ఆర్ఎక్స్ 100’ తమిళంలోకి రీమేక్ అవుతుండగా అందులో ఆది పినిశెట్టినే కథానాయకుడిగా నటించనున్నాడు. అతడికి జోడీగా పాయల్ పాత్రలో తాప్సి నటించనుందట. అంటే కొన్నేళ్ల కిందట పోషించిన పాత్రల్ని పోలిక క్యారెక్టర్లనే మళ్లీ వీళ్లిద్దరూ చేయబోతున్నారన్నమాట. ఐతే ‘ఆర్ఎక్స్ 100’ ఆల్రెడీ తెలుగులో హిట్టయింది కాబట్టి ఇందులోని కంటెంట్ ప్రకారం చూస్తే తమిళంలోనూ ఆడే అవకాశాలున్నాయి. కాకపోతే తెలుగులో కనిపించిన లోపాల్ని దిద్దుకోవాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా వర్కవుట్ చేస్తే ఇంతకుముందు ఫ్లాప్ అయిన క్యారెక్టర్లే ఈ సారి హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్ హక్కుల్ని స్వయంగా తనే దక్కించుకున్న ఆది.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు