పెట్టిన టికెట్లు పెట్టినట్లే..

పెట్టిన టికెట్లు పెట్టినట్లే..

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. అతను రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. కానీ ఆ క్రేజ్.. ఆ ఇమేజ్ ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయా అని సందేహించే వాళ్లకు ‘గీత గోవిందం’ అడ్వాన్స్ బుకింగ్స్ సమాధానం చెబుతున్నాయి. విజయ్‌ది బలుపే తప్ప వాపు కాదని బుకింగ్స్ రుజువు చేస్తున్నాయి.

మామూలుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజైనపుడు ఉండే డిమాండ్ ‘గీత గోవిందం’కు కనిపిస్తుండటం విశేషం. ‘బుక్ మై షో’ సహా టికెట్ బుకింగ్ వెబ్ సైట్లలో తొలి రోజు షోల కోసం పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు ఫుల్స్ పడిపోయాయి. హైదరాబాద్‌లో శివార్లలో ఉండే థియేటర్లలో తప్పితే.. అన్ని చోట్లా తొలి రోజు అన్ని షోలకూ టికెట్లు అయిపోయాయి.

ఈ డిమాండ్ చూసి మల్టీప్లెక్సుల్లో షోలు పెంచి టికెట్లు అందుబాటులోకి తెస్తుండగా.. అవి కాసేపట్లోనే ఫుల్ అయిపోతున్నాయి. ఈ డిమాండ్ చూసి థియేటర్లు కూడా పెంచుతున్నారు. కానీ ఎక్కడా జోరు తగ్గట్లేదు. ముందు అనుకున్న దాని కంటే ఈ చిత్రం భారీ స్థాయిలోనే రిలీజయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి వేరే అంశాలు కూడా కలిసొచ్చినప్పటికీ.. ఈ క్రేజ్‌కు ముఖ్య కారకుడు మాత్రం విజయే అనడంలో సందేహం లేదు.

‘అర్జున్ రెడ్డి’ వచ్చిన ఏడాది తర్వాత అతడి సినిమా రిలీజవుతుండటంతో కుర్రాళ్లు మామూలు ఉత్సాహంలో లేరు. తొలి రోజు ఈ చిత్రానికి పెద్ద హీరోల సినిమాకు వచ్చిన రేంజిలో ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. తొలి వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే నంబర్స్ నమోదవడం ఖాయం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English