విజయ్ దేవరకొండ ‘రౌడీ’ థియరీ ఎంటంటే?

విజయ్ దేవరకొండ ‘రౌడీ’ థియరీ ఎంటంటే?

స్టార్ హీరోలు అభిమానుల్ని ఎంతో ప్రేమగా సంబోధిస్తుంటారు. వాళ్లు తమ కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లని అంటుంటారు. ఐతే విజయ్ దేవరకొండ మాత్రం తన అభిమానుల్ని రౌడీ బాయ్స్ అని సంబోధిస్తుంటాడు. అభిమానుల్ని రౌడీలనడమేంటో జనాలకు ముందు అర్థం కాలేదు. ఈ పిలుపే చిత్రంగా అనిపించింది. కానీ అతను మాత్రం అదే పిలుపును కొనసాగిస్తున్నాడు.

ఎక్కడ.. ఎప్పుడు అభిమానుల్ని కలుసుకున్నా ‘వాట్సాప్ రౌడీ బాయ్స్’ అంటూ వాళ్లలో ఉత్సాహం నింపుతుంటాడు. ‘రౌడీ’ పేరుతో అతను ఒక అపారెల్ బ్రాండ్ కూడా ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరి మరే పిలుపూ లేనట్లు అభిమానుల్ని రౌడీలుగా పిలుచుకోవడానికి కారణమేంటా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈ విషయమై విజయ్ వివరణ ఇచ్చాడు.

తన కొత్త సినిమా ‘గీత గోవిందం’ పైరసీ బారిన పడ్డ నేపథ్యంలో ఈ విషయమై నిర్వహించిన ప్రెస్ మీట్లో తాను తనను ఇష్టపడేవాళ్లను ఎందుకు ఫ్యాన్స్ అననో వివరించాడు. తాను చాలా చిన్నవాడినని.. కొన్నేళ్ల ముందు వరకు అందరు కుర్రాళ్ల లాగే కాలేజీలో చదువుకుంటున్న వాడినని విజయ్ చెప్పాడు. స్టూడెంటుగా ఉంటూనే సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేశానని.. అనుకోకుండా మంచి సినిమాలు పడి హీరోగా పేరు సంపాదించానని.. ఈ మాత్రానికే తానేదో పెద్దవాడిని అయిపోయినట్లు భావించి తనను ఇష్టపడేవాళ్లను ఫ్యాన్స్ అని సంబోధించాలంటే ఏదోలా ఉంటుందని.. అందుకే వాళ్లను ‘రౌడీస్’ అని సరదాగా పిలుస్తుంటానని చెప్పాడు.

ఐతే తనలాంటి కుర్రాళ్లే ఇప్పుడు ‘గీత గోవిందం’ను పైరసీ చేసి వైరల్ చేయడం.. ఈ నేరానికి అరెస్టవడం చాలా బాధేస్తోందని విజయ్ చెప్పాడు. దయచేసి ఇకపై ఇలా చేయొద్దని స్టూడెంట్స్‌కి అతను పిలుపు ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు