గూఢచారి-2నే కాదు.. గూఢచారి-3 కూడా

గూఢచారి-2నే కాదు.. గూఢచారి-3 కూడా

పది రోజుల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గూఢచారి’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అంచనాలకు మించి వసూళ్లు కూడా రాబట్టింది. ఈ చిత్రం తొలి వారంలోనే పెట్టుబడిని వెనక్కి తేవడం విశేషం. రెండో వారాంతంలో వస్తున్న వసూళ్లన్నీ లాభాలే. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. కానీ అంత తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ చూపించగలిగారు.

కంటెంట్ పరంగా అంతర్జాతీయ ప్రమాణాలు కనిపిస్తాయీ చిత్రంలో. ‘గూఢచారి’కి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడం విశేషం. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రాన్ని ప్రశంసిచింది. ఇక మన నాగార్జున ఈ సినిమాను ఏ స్థాయిలో కొనియాడాడో తెలిసిందే.

ఈ ప్రశంసలన్నీ చిత్ర బృందానికి మంచి ఉత్సాహాన్నిచ్చినట్లే ఉన్నాయి. ఈ ఊపులో ‘గూఢచారి’కి సీక్వెల్ తీయాడనికి రెడీ అవుతోంది ఈ టీం. ఐతే ఒక సీక్వెల్‌తో కూడా ఆగిపోవట్లేదట. ఈ సిరీస్‌లో కనీసం రెండు సినిమాలు చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శశికిరణ్ తిక్కనే వెల్లడించాడు. ఇప్పటికే సీక్వెల్ మీద పని మొదలైందన్నాడు.

‘గూఢచారి-2’తో పాటు.. ‘గూఢచారి-3’ కూడా వస్తుందని ప్రకటించాడు. శేష్.. తాను కలిసి ప్రస్తుతం ఐడియాలు డిస్కస్ చేస్తున్నామన్నాడు. ‘గూఢచారి’ సినిమా చూస్తే సీక్వెల్‌కు బాగా స్కోప్ ఉన్నట్లే కనిపిస్తుంది. ‘గూఢచారి’ కథను కొంచెం తక్కువ పరిధిలోనే ముగించారు. ఈసారి బడ్జెట్ అదీ బాగానే లభిస్తుంది కాబట్టి కొంచెం పెద్ద రేంజిలోనే సీక్వెల్స్ ప్లాన్ చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు