ఈ కుర్చీలాటేంటి.. త్రివిక్రమ్ జీ

ఈ కుర్చీలాటేంటి.. త్రివిక్రమ్ జీ

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెకక్కుతున్న ‘అరవింద సమేత’ టీజర్ ఆగస్టు 15న విడుదల కాబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు టైమింగ్ కూడా ఇచ్చారు. బుధవారం ఉదయం 9 గంటలకే ఈ టీజర్ లాంచ్ కాబోతోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

డార్క్ షేడ్‌లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడందులో. అతడి ముందు ఒక వ్యక్తి పడి ఉన్నాడు. బ్యాగ్రౌండ్ అంతా కూడా కుర్చీలు బల్లలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యం చూస్తే అందరికీ మళ్లీ ‘అజ్ఞాతవాసి’ గుర్తుకొస్తోంది.

ఆ చిత్ర టీజర్లో పవన్ కళ్యాణ్ కుర్చీని రౌండ్ తిప్పి.. ఒక కుర్చీ తయారు కావడం వెనుక ఉండే కష్టాన్ని వివరిస్తాడు. అప్పట్లో ఆ డైలాగ్ సూపర్ పాపులరైంది. సినిమా మీద అంచనాలు పెంచింది. కానీ సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడం వేరే విషయం. ఐతే ఈ కుర్చీ ఎఫెక్ట్‌ని నెగెటివ్ సెంటిమెంటుగా భావించకుండా త్రివిక్రమ్ మళ్లీ ‘అరవింద సమేత’ కోసం కూడా ఉపయోగించుకోవడం ఆసక్తి రేకెత్తించే విషయమే. ‘అజ్ఞాతవాసి’ త్రివిక్రమ్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈసారి తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు.

ఎప్పట్నుంచో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని చూస్తున్న తారక్.. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత ఒక ట్రికీ సిచువేషన్లో ఈ సినిమా చేశాడు. మరి ‘అరవింద సమేత’ వీళ్లిద్దరికీ ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి. దసరా కానుకగా అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు