అల్లు అరవింద్ అంతలా పొగిడేశాడే..

అల్లు అరవింద్ అంతలా పొగిడేశాడే..

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఏ హీరోనూ అతిగా పొగడడు. అందులో నాన్-మెగా ఫ్యామిలీ హీరోల గురించి ఆయన మాట్లాడటం చాలా తక్కువ. అలాంటిది తన బేనర్లో ‘గీత గోవిందం’ సినిమా చేసిన విజయ్ దేవరకొండను ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో అరవింద్ పొగిడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ సూపర్ స్టార్ కాబోతున్నాడని ఆయన జోస్యం చెప్పడం విశేషం.

విజయ్ దేవరకొండ మామూలు నటుడు కాదని.. అతనేంటో ఏడాది నుంచి తాను చూస్తున్నానని.. అతడి నటనలో చాలా వైవిధ్యం ఉందని అరవింద్ అన్నాడు. అందరూ అతడిని మూడు నాలుగు సినిమాల నటుడిగా చూస్తున్నారని.. కానీ తనకైతే అతడి వంద సినిమాల స్పాన్ కనిపిస్తోందని.. అతి త్వరలోనే విజయ్ అగ్ర కథానాయకుల సరసన చేరతాడని.. ఈ మాట గుర్తుపెట్టుకోండని అరవింద్ అన్నాడు. తర్వాత హీరోయిన్ రష్మిక మందాన్నా గురించి మాట్లాడుతున్నపుడు కూడా  అరవింద్ విజయ్ ప్రస్తావన చెప్పాడు. రష్మిక చించేసిందన్న అరవింద్.. విజయ్ లాంటి నటుడిని మ్యాచ్ చేస్తూ అతడి ముందు పెర్ఫామ్ చేయడం మామూలు విషయం కాదని.. అతడి ముందు ఆమె నిలవగలగడమే గొప్ప విషయమని అరవింద్ అన్నాడు.

విజయ్ గురించి పొగుడుతున్నపుడు అరవింద్ చాలా ఆవేశంగా కూడా కనిపించాడు. ఆయన ఇంత ఎమోషనల్‌గా మాట్లాడటమూ అరుదే. ప్రతి నిర్మాతా తన సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడతాడని.. కానీ తమకు సక్సెస్‌ విషయంలో కొన్ని కొలమానాలు ఉంటాయని.. ఆ రకంగా చూస్తే ‘గీత గోవిందం’ ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో అంచనా వేయలేమని.. ఇది చాలా పెద్ద స్థాయికి వెళ్తుందని కూడా అరవింద్ ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు