హన్సికకూ ఆ పిచ్చి పట్టింది

హన్సికకూ ఆ పిచ్చి పట్టింది

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఒకప్పుడు అందరిలోనూ ఒక భయం ఉండేది. నిర్మాతలు వాటిపై ఖర్చు పెట్టడానికి సందేహించేవాళ్లు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాల పట్ల ఆసక్తి చూపించేవాళ్లు కాదు. కానీ గత కొన్నేళ్లో ఈ అభిప్రాయాలు మారిపోయేలా చేశాయి కొన్ని సినిమాలు.

బాలీవుడ్లో కంగనా రనౌత్.. దక్షిణాదిన అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి విజయాలందుకుని ఈ తరహా సినిమాలకు ఊపు తెచ్చాయి. దీంతో మిగతా స్టార్ హీరోయిన్లు కూడీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తమ ముద్ర చూపించాలని తహతహలాడిపోతున్నారు. కానీ అందరికీ అలా కలిసి రావడం లేదు.

ఉదాహరణకు త్రిష సంగతే తీసుకుంటే.. ఇప్పటికే ఆమె ‘నాయకి’.. ‘మోహిని’ లాంటి లేడీ ఓరియెంట్ సినిమాలు చేసింది. వాటి ఫలితాలేంటో తెలిసిందే. ఇప్పుడు హన్సికకు సైతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల పిచ్చి పట్టినట్లుంది. ఆమె లీడ్ రోల్‌లో ‘మహా’అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఇది హన్సికకు 50వ సినిమా కావడం విశేషం. జమీల్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఐతే అనుష్క.. నయన్ లాంటి వాళ్లు నటులుగా మంచి గుర్తింపు సంపాదించారు. వాళ్లకంటూ ఒక ఇమేజ్ ఉంది. హన్సిక సంగతలా కాదు. ఆమె జస్ట్ ఒక గ్లామర్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ ఇమేజ్ కూడా లేదు. ఆమెకు లేడీ ఓరియెంటెడ్ మూవీని హోల్డ్ చేయగల సత్తా ఉందా.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలదా అన్నది డౌటు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు