సామ్రాట్‌ గురించి తేజస్వి ఏమందంటే..

సామ్రాట్‌ గురించి తేజస్వి ఏమందంటే..

హిందీ ‘బిగ్ బాస్’ షోను మొదట్నుంచి చూస్తున్న వాళ్లకి హౌస్ లో ఎన్ని ఎఫైర్లు నడిచాయో.. ఎంతమంది ఇక్కడ లవర్స్ అయ్యారో.. బహిరంగంగా ఎలా రొమాన్స్ చేసుకున్నారో తెలిసే ఉంటుంది. ఐతే దక్షిణాది జనాలు కొంచెం సంప్రదాయబద్ధంగా ఉంటారు కాబట్టి ఇంకా ‘బిగ్ బాస్’లో ఇలాంటి శ్రుతి మించిన వ్యవహారాలు చోటు చేసుకోలేదు. అలాగని ఇక్కడ అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఫ్లర్టింగ్స్.. కవ్వింతలు లేకుండా ఏమీ లేవు. గత ఏడాది తమిళ బిగ్ బాస్‌లో ఒవియా-ఆరవ్ మధ్య ప్రేమ చిగురించింది. ఈ షో తర్వాత కూడా వాళ్లిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికొస్తే ఈ ఏడాది సామ్రాట్-తేజస్వి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి.

ఈ సందేహాలకు బలం చేకూర్చేలా వీళ్లిద్దరూ ప్రవర్తించారు. తేజస్వి ఎలిమినేట్ అయినపుడు తనలా ఎవ్వరూ ప్రేమలో పడొద్దనడం చర్చనీయాంశమైంది. సామ్రాట్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నేపథ్యంలో హౌస్ నుంచి వచ్చాక తేజస్విని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. తేజస్వి కూడా దీనికి సానుకూలమే అన్నట్లు కనిపించింది. కానీ తాజాగా ఆమె ఒక మీడియా సంస్థతో ఈ విషయమై స్పందించింది. సామ్రాట్ అంటే తనకు ఇష్టమే అని.. అలాగని అతడిని పెళ్లిచేసుకోవట్లేదని చెప్పింది. తామిద్దరం ఎప్పటికీ మంచి మిత్రులుగా కొనసాగుతామంది. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని.. జనాలు ఏవేవో ఊహించుకోవద్దని తేల్చి చెప్పింది. మరి హౌస్ నుంచి వచ్చాక ఈ విషయమై సామ్రాట్ ఏమంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English