తమిళ బాహుబలి.. ఇక లేనట్లే

తమిళ బాహుబలి.. ఇక లేనట్లే

సంఘమిత్ర.. మూడేళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఇప్పటిదాకా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది లేదు. ‘బాహుబలి’కి దీటైన సినిమాతో తమిళ సినిమా ప్రతిష్టను పెంచాలని సీనియర్ దర్శకుడు సుందర్ తలపెట్టిన మెగా ప్రాజెక్టు ఇది. కానీ ఏవో అడ్డంకులతో ఈ చిత్రం పట్టాలెక్కడం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు ఈ సినిమా కోసం. ఐతే గత ఏడాదే మొదలు కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. కొన్ని నెలల పాటు ఈ సినిమా గురించి ఏ సమాచారం లేకపోగా.. ఇటీవలే సుందర్ స్వయంగా ‘సంఘమిత్ర’ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని ప్రకటించాడు. నిర్మాణ సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

కానీ ఆగస్టు వచ్చింది.. కానీ ఈ సినిమా మొదలవుతుందన్న సంకేతాలేమీ కనిపించడం లేదు. పైగా ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందేమో అన్న సందేహాలు కలిగించే అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి శ్రుతి హాసన్ స్థానంలో కథానాయికగా ఎంపికైన బాలీవుడ్ భామ.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను దక్షిణాదిన ఒక భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించానని.. కానీ ఆ సినిమా వర్కవుటయ్యేలా లేదని ఆమె చెప్పింది. దిశా మాటలు ‘సంఘమిత్ర’ను ఉద్దేశించ అని భావిస్తున్నారు. ఆమె మాటల్ని బట్టి చూస్తే ఈ సినిమా మొత్తంగా ఆగిపోయిందేమో అనిపిస్తోంది. ఈ చిత్రానికి కథానాయకులుగా అనుకున్న జయం రవి, ఆర్య సైతం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో తీయాలనుకున్న ఈ సినిమా ముందుకు కదలడం కష్టమే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు