బాహుబ‌లి-2 రికార్డు బద్దలు కొట్టిన విశ్వ‌రూపం-2!

బాహుబ‌లి-2 రికార్డు బద్దలు కొట్టిన విశ్వ‌రూపం-2!

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెర‌కెక్కిన `విశ్వ‌రూపం-2`శుక్ర‌వారం నాడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విశ్వరూపంతో పోలిస్తే....విశ్వ‌రూపం -2 అంత‌గా ఆక‌ట్టుకోలేద‌ని డివైడ్ టాక్ వ‌చ్చింది. సీక్వెల్ లో క‌మ‌ల్ మెప్పించలేకపోయిందని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు. అయితే, డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ....విశ్వ‌రూపం ఓ అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకుంది. చెన్నైలో బాహుబ‌లి-2 చిత్రం తొలిరోజు క‌లెక్ష‌న్ల రికార్డును విశ్వ‌రూపం-2 బ‌ద్ద‌లు కొట్టింది. దాంతోపాటు, త‌మిళ‌నాడులో ఈ సినిమా తొలిరోజు మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. చెన్నైలో బాహుబలి-2 తొలిరోజు 92 లక్షలు వ‌సూలు చేయ‌గా....విశ్వ‌రూపం-2 తొలిరోజు 93ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.

చెన్నైలో తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రాల జాబితాలో విశ్వరూపం2 ఆరో స్థానంలో ఉంది. కాలా, వివేగం, కబాలి, తేరి లాంటి సినిమాల తరువాత విశ్వరూపం2 ఉండ‌డం విశేషం. అయితే, విశ్వ‌రూపం-2 విడుద‌ల తేదీ విష‌యంలో ప‌లు అనుమానాలు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా తమిళ వెర్ష‌న్ విడుద‌ల‌ను సవాల్ చేస్తూ పిరమిడ్ సైమరా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు వెళ్లడంతో విడుద‌ల వాయిదాప‌డుతుంద‌ని అంతా భావించారు. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నుకున్న త‌రుణంలో క‌లైజ్ఞ‌ర్ క‌రుణానిధి మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌మ‌ల్ విడుద‌ల‌ను వాయిదా వేసేందుకు మొగ్గు చూపార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆగ‌స్టు 15న చిత్రం విడుద‌ల చేసేందుకు క‌మ‌ల్ ప్లాన్ చేస్తున్నార‌న్న టాక్ నేప‌థ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద‌గా కాలేదు. అయిన‌ప్ప‌టికీ, చెన్నైలో బాహుబ‌లి-2 రికార్డును ఈ చిత్రం బ‌ద్ద‌లు కొట్ట‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు