విజయ్ దేవరకొండ రేంజ్ చూస్తారు..

విజయ్ దేవరకొండ రేంజ్ చూస్తారు..

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అన్నది దాదాపు అసాధ్యమే. కొంచెం క్రేజ్ అయితే సంపాదించుకోవచ్చు కానీ.. స్టార్ ఇమేజ్ మాత్రం కష్టమే. బ్యాగ్రౌండ్ లేని హీరోలు పెద్ద స్థాయికి వెళ్లాలంటే చాలా ఏళ్లు పడుతుంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇందుకు మినహాయింపే అని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అతడికి మామూలు క్రేజ్ రాలేదు.


నిజంగా అతను రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అసలు ఈ సినిమా విడుదలకు ముందే అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి. కేవలం టీజర్.. ట్రైలరే అతడికి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. విడుదలకు ముందు ప్రమోషన్లలో.. సోషల్ మీడియాలో విజయ్ చూపించిన యాటిట్యూడ్ కూడా అతడిని ఈ తరం యువతకు బాగా చేరువ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతడి కొత్త సినిమా కోసం యూత్ మామూలుగా ఎదురు చూడట్లేదు.

వారి నిరీక్షణకు ఇంకో నాలుగు రోజుల్లోనే తెరపడబోతోంది. విజయ్ కొత్త సినిమా ‘గీత గోవిందం’ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచ్చే బుధవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంపై హైప్ ఓ రేంజిలో ఉంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వస్తాయంటున్నారు ట్రేడ్ పండిట్లు. పెద్ద స్టార్ హీరోల స్థాయిలో విజయ్ బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడని.. అది చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాకవడం ఖాయమని చెబుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ వచ్చన దాదాపు ఏడాదికి ‘గీత గోవిందం’ వస్తోంది. విజయ్ క్రేజ్ గాలివాటమే అయితే ఈపాటికి అదంతా పోయి.. అతడి కొత్త సినిమాకు ఇంత హైప్ రాకూడదు. కానీ ఏడాది పాటు తన అభిమానుల్ని పలు మార్గాల ద్వారా ఎంగేజ్ చేస్తూ.. వాళ్లను హోల్డ్ చేయడంలో విజయ్ విజయవంతమయ్యాడు.

అతండంటే వెర్రెత్తిపోయేలా ఉన్నారు యూత్. ‘అర్జున్ రెడ్డి’కి ఏమాత్రం తగ్గని రీతిలో ‘గీత గోవిందం’కు క్రేజ్ తీసుకురావడంలో విజయ్ పాత్ర కూడా కీలకమే. తొలి రోజు ఈ చిత్రానికి రూ.10 కోట్ల స్థాయిలో షేర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం.. కేవలం వారసత్వంతో నెట్టుకొస్తున్న బాబులందరికీ విజయ్ పెద్ద ముప్పుగా పరిగణించడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు