నాగశౌర్య ఎంత పెద్ద రిస్క్?

నాగశౌర్య ఎంత పెద్ద రిస్క్?

టాలీవుడ్ యువ కథానాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగశౌర్య. కెరీర్ మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. ఈ ఏడాది ఆరంభంలో ‘ఛలో’ సినిమాతో తిరుగులేని విజయాన్నందుకున్నాడు. వరుస ఫ్లాపులకు తోడు.. కెరీర్లో ఎన్నడూ లేనంతగా గ్యాప్ వచ్చిన టైంలో అతడి కుటుంబం సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించి సాహసం చేసింది. వారి సాహసానికి మంచి ఫలితమే దక్కింది. రూ.5-6 కోట్ల మధ్య బడ్జెట్లో తెరకెక్కిన ‘ఛలో’.. పెట్టుబడికి రెట్టింపు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. సోలో హీరోగా శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు అతడి సొంత బేనర్లోనే ‘నర్తనశాల’ అనే మరో సినిమా రాబోతోంది. ఐతే ఈ చిత్రంపై ఏకంగా రూ.15 కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా నాగశౌర్య చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది.

‘ఛలో’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అన్నిసార్లూ అలాంటి విజయాలు రావు. ‘ఛలో’ తర్వాత శౌర్య నుంచి వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాపులే. ‘కణం’ సినిమాలో అతడిది ప్రాధాన్యం లేని పాత్ర.. పైగా అది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఓకే అనుకుందాం. కానీ శౌర్య ఎంతో ఇష్టపడి చేసిన ‘అమ్మమ్మగారిల్లు’ కూడా ఆడలేదు. ఆ సినిమా షేర్ రూ.3 కోట్లకు మించలేదు. అలాంటపుడు ‘నర్తనశాల’ మీద ఏకంగా రూ.15 కోట్లు పెట్టేయడం ఎంత పెద్ద రిస్క్? ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పెట్టుబడి వెనక్కి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ‘ఛలో’కు అప్పుడు రోడ్ క్లియర్ గా ఉంది. కానీ ఇప్పుడు ముందు వెనుక ఆసక్తికర చిత్రాలున్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ లాంటి క్రేజీ మూవీతో అది పోటీ పడుతోంది. అది మినిమం గ్యారెంటీ అనిపిస్తున్న సినిమా. అలాంటి సినిమాకు పోటీగా వస్తూ రూ.15 కోట్ల టార్గెట్ అంటే చాలా కష్టమే. ఒక్కసారిగా రూ.15 కోట్ల బడ్జెట్ కు వెళ్లిపోవడం అన్నది ఏమాత్రం సబబుగా అనిపించే విషయం కాదు. ఈ బడ్జెట్ చూస్తుంటే ‘ఛలో’ సక్సెస్ మరీ శౌర్య నెత్తికి ఎక్కేసిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English