మోహన్ లాల్ సెన్సేషనల్ క్యారెక్టర్

మోహన్ లాల్ సెన్సేషనల్ క్యారెక్టర్

దక్షిణాదిన గొప్ప నటుల జాబితా తీస్తే అందులో మోహన్ లాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. మూడు దశాబ్దాలకు పైగా ఉజ్వలంగా సాగుతున్న కెరీర్లో ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ రెండేళ్ల కిందట ఒక అంధుడి పాత్రను పోషించి మెప్పించాడు. తెలుగులో ‘కనుపాప’ పేరుతో విడుదలైన ఆ చిత్రం మలయాళంలో పెద్ద విజయం సాధించింది.  మోహన్ లాల్‌ పెర్ఫామెన్స్‌కు కూడా గొప్ప ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత కూడా ఆయన ఇలాంటి వైవిధ్యమైన పాత్రలతోనే సాగిపోతున్నారు. లాల్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఒడియన్’ గురించిన విశేషాలు తెలుసుకుంటుంటే అభిమానులకు ఉద్వేగం కలుగుతోంది. ఇందులో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందట.

లాల్ ఇందులో వేరే వేరే రూపాల్లోకి మారిపోతాడట. యుక్త వయస్కుడిగా.. పండు ముసలిగా.. అలాగే కొన్నిసార్లు జంతువుగా కూడా మారిపోతుంటాడట. ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర మామూలుగా షాకివ్వదని అంటున్నారు. ఈ చిత్రం కోసం లాల్ బాగా సన్నబడి షాకింగ్ లుక్‌లోకి మారాడు. సినిమాలో ఆయన మరిన్ని అవతారాలతో షాకిస్తాడట. ఇది లాల్ కెరీర్లో ఒక మైలురాయిలాగా నిలిచిపోయే సినిమా అంటున్నారు. ఈ చిత్రం శ్రీకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ.. వీఎఫెక్స్ సమకూరుస్తుండటం విశేషం. ఇందులో మంజు వారియర్.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్లో మహాభారత కథ ఆధారంగా ఒక సినిమా చేయడానికి లాల్ సన్నద్ధమవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English